ఘనంగా.. ఉచితంగా.. RGV ‘పరాన్నజీవి’ టీజర్

ఇప్పుడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య సినిమాల రూపంలో పోటీ క్రియేట్ అయ్యింది. పవన్‌ను టార్గెట్ చేస్తూ ఆర్జీవీ ‘పవర్‌స్టార్’ అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ట్రైలర్ విడుదల చేసి వివాదం మరింత ముదిరేలా చేశాడు వర్మ. ‘పవర్‌స్టార్’ ట్రైలర్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే పవన్ అభిమానులు నూతన్ నాయుడు దర్శకత్వంలో పవన్‌కు సపోర్ట్‌గా రూపొందుతోన్న ‘పరాన్నజీవి’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో రామ్ గోపాల్ వర్మ పాత్రలో కమెడియన్ షకలక శంకర్ నటిస్తున్నాడు. జూలై 23 సాయంత్రం 7 గంటలకు ‘పరాన్నజీవి’ టీజర్ ఘనంగా.. పూర్తి ఉచితంగా విడుదల చేస్తున్నాం.. అంటూ మూవీ టీమ్ ప్రకటించింది. ‘‘భీభత్సమైన వివరణ: దురదృష్టవశాత్తూ మా టీమ్ సభ్యులలో ఒకరు చేసిన కుట్ర వల్ల ఈ టీజర్ ఈరోజు 6 గంటలకే లీక్ అవుతున్నందుకు ఇంకొంచెం ఎక్కువ సంతోషిస్తున్నాం. ఈరోజు ఆరింటికి చూసినా ఫ్రీనే.. ఆరు దాటాక చూసినా ఫ్రీనే!’’ అంటూ పబ్లిసిటీ చేయడంలో వర్మకి మేమేం తీసిపోము అన్నట్టు ప్రకటన ఇచ్చింది ‘పరాన్నజీవి’ యూనిట్. వర్మను ఏ రేంజ్‌లో ఆడుకున్నారో ఆరు తర్వాత తెలుస్తుందన్నమాట.