Pavala Shyamala : వృద్ధాశ్రమంలో దీనస్థితిలో ఒకప్పటి లేడీ కమెడియన్.. ఆదుకోవాలంటూ..
తన కామెడీతో అందరికీ ఆనందం పంచిపెట్టిన ఆమె గత కొంతకాలంగా దయనీయ జీవితం గడుపుతోంది. నిస్సాహయస్థితిలో ఉన్న ఈ సీనియర్ నటి ఆపన్నహస్తం అందించాలని ఆర్థిస్తోంది.

Pavala Shyamala Tragedy Life Requesting Help for Survival
Pavala Shyamala : ఒకప్పుడు చాలా సినిమాల్లో కమెడియన్ గా చేసి, బిజీగా ఉండి ఆ తర్వాత అవకాశాలు లేక, వయసు కూడా సహకరించకపోవడంతో, కూతురు ఆరోగ్యం కూడా పాడవడంతో ఇప్పుడు వృద్ధాశ్రమంలో దీనస్థితిలో ఉంది పావలా శ్యామలా.
పావలా శ్యామల 1984లో బాబాయ్ అబ్బాయ్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించి స్వర్ణ కమలం, కర్తవ్యం, ఇంద్ర, ఖడ్గం, బ్లేడ్ బాబ్జీ, గోలీమార్ వంటి సుమారు 250 సినిమాలలో హాస్య నటిగా, సహాయ నటిగా నటించారు. అనేక అవార్డులు అందుకొన్నారు. ఆమె నటనకు అనేక సంస్థలు సన్మానాలు చేశాయి. అలాంటి నటి ఇప్పుడు తినడానికి తిండి కూడా లేక, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.
తన కామెడీతో అందరికీ ఆనందం పంచిపెట్టిన ఆమె గత కొంతకాలంగా దయనీయ జీవితం గడుపుతోంది. నిస్సాహయస్థితిలో ఉన్న ఈ సీనియర్ నటి ఆపన్నహస్తం అందించాలని ఆర్థిస్తోంది. ఒకవైపు ఆర్ధిక భారం, మరో వైపు వయోభారం ఆమెకు నరకం చూపిస్తున్నాయి. అంతేకాకుండా ఎదిగిన కూతురు మంచానికి పరిమితమవ్వడం పావలా శ్యామలకి మనోవేదనను కల్గిస్తున్నాయి. గతంలో ఆమెకు కొంత మంది సినీ ప్రముఖులు సాయం అందించినా అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కల్గించింది.
ఇటీవల కొంతమంది సినీ పరిశ్రమకు సంబంధించిన వారు ఆమెని కలవగా.. తనకు వచ్చిన అవార్డులను అమ్ముకొని ఆ డబ్బుతో బియ్యం, పప్పులు కొనుకొన్నరోజులున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న తాము తినడానికి తిండి లేక ఒక్కోసారి పస్తులుండాల్సి వచ్చిందని చెప్పారు. మందులు కొనుక్కోలేకపోతున్నాను అని కొనుక్కోగలమని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఏదో ఓ రోజు ఇద్దరం మంచంలోనే ఆకలితో చనిపోతామని పావలా శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం సరిపోవడంలేదు అని కూడా చెప్పి ఎమోషనల్ అయ్యారు.
Also Read : Keedaa Cola Trailer : కీడాకోలా ట్రైలర్ రిలీజ్.. సరికొత్త క్రైమ్ కామెడీ డ్రామా..
పావలా శ్యామల ప్రస్తుతం ఫిర్జాదీగూడ లోని ఓ వృద్దాశ్రమంలో ఉంటుంది. ఆ ఆశ్రమానికి నెలవారి డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతుంది. ఆమెకు డబ్బు, మందులు, నిత్యావసర సరుకులు మరేదైనా ఇచ్చి సాయపడాలనుకొంటే నేరుగా వెళ్ళి అందించొచ్చు. నటి పావలా శ్యామలకు సహాయం చెయ్యాలనుకునేవారు.. Neti Shyamala , A/c: 52012871059, IFSC :SBIN0020458, Srikrishna Nagar , Yusufguda Branch , Hyderabad కి అమౌంట్ పంపించొచ్చు లేదా 9849175713 నంబర్ ని సంప్రదించవచ్చు అని ఆమెని కలిసిన పలువురు తెలిపారు.