Pavithra Lokesh : పవిత్ర లోకేష్‌తో పరీక్ష రాయించిన నరేష్.. ఇప్పుడు కూడా పవిత్ర చదువుకుంటుందా?
వీళ్ళిద్దర్నీ ఈ వయసులో ప్రేమ, పెళ్లి అని ట్రోల్ చేసినా ఇప్పుడు ఒక్క విషయంలో మాత్రం వీరిద్దర్నీ అభినందిస్తున్నారు పలువురు నెటిజన్లు. ఎందుకంటే పవిత్ర లోకేష్ ఇప్పుడు కూడా చదువుకుంటుందట.

Pavithra Lokesh written PhD entrance exam in Kannada naresh gives support
Naresh – Pavithra : ఇటీవల నరేష్ – పవిత్ర లోకేష్ జంట బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. వాళ్ళు బాగా వైరల్ అవ్వడం, వారిపై ట్రోల్స్ రావడమే కాకుండా ఇద్దరూ కలిసి మళ్ళీపెళ్లి(Malli Pelli) అనే సినిమాను కూడా తీసి రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా అంతగా ఆడకపోయినా సినిమాని మాత్రం బాగా ప్రమోట్ చేశారు నరేష్. నెటిజన్లు ఈ సినిమాని కూడా బాగా ట్రోల్ చేశారు.
వీళ్ళిద్దర్నీ ఈ వయసులో ప్రేమ, పెళ్లి అని ట్రోల్ చేసినా ఇప్పుడు ఒక్క విషయంలో మాత్రం వీరిద్దర్నీ అభినందిస్తున్నారు పలువురు నెటిజన్లు. ఎందుకంటే పవిత్ర లోకేష్ ఇప్పుడు కూడా చదువుకుంటుందట. ఇప్పటికే PG చేసిన పవిత్ర తన మాతృభాష కన్నడలో PhD చేయాలని ఎప్పట్నుంచో కోరిక అట. దీనికి నరేష్ కూడా ఒప్పుకోవడంతో తాజాగా పవిత్ర లోకేష్ కర్ణాటకలోని బళ్లారికి వెళ్లి PhD ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది.
పవిత్ర ఎగ్జామ్ రాయడం ఒక ఎత్తు అయితే నరేష్ స్వయంగా పవిత్రను తీసుకెళ్లి ఎగ్జామ్ అయ్యేదాకా పరీక్ష కేంద్రం బయటే వెయిట్ చేశారట. ఈ వార్త కన్నడ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ వయసులో చదువుకుంటున్నందుకు పవిత్రను, ఆమెకు సపోర్ట్ చేస్తున్నందుకు నరేష్ ను ఈ విషయంలో మాత్రం పలువురు అభినందిస్తున్నారు.