Pawan Kalyan : ‘మా’ ఎన్నికల కోసం ఇంత హడావిడి చేసి ఉండాల్సింది కాదు : పవన్ కళ్యాణ్

పోలింగ్ మొదలైన కొద్ది సేపటికే స్టార్ హీరోలు తరలి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఉదయమే వచ్చి తన ఓటు వినియోగించుకున్నారు. పవన్ ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ 900 మంది ఉన్న

Pawan Kalyan : ‘మా’ ఎన్నికల కోసం ఇంత హడావిడి చేసి ఉండాల్సింది కాదు : పవన్ కళ్యాణ్

Pk

Updated On : October 10, 2021 / 10:53 AM IST

Pawan Kalyan :  గత కొద్ది రోజులుగా ‘మా’ ఎలక్షన్స్ కోసం రెండు ప్యానెల్స్ విపరీతంగా ప్రచారం చేశాయి. ఈ సారి ‘మా’ ప్రసిడెంట్ పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ చేస్తున్నారు. వీరి తరపున రెండు ప్యానెల్స్ లో ఆర్టిస్టుల పోరు హోరాహోరీగా మారింది. ప్రెస్ మీట్స్ పెట్టి ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకున్నారు. వ్యక్తిగత దూషణల దాకా వెళ్లారు. ఫిర్యాదులు కూడా చేశారు. దీనిపై కొంత మంది సినీ పెద్దలు అసహనం వ్యక్తం చేశారు. ‘మా’ అసోసియేషన్ లోని 26 మంది కార్యవర్గం కోసం మొత్తం రెండు ప్యానళ్ల తరపున 54 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది.

Maa Elections 2021 Live : మొదలైన ‘మా’ సమరం

పోలింగ్ మొదలైన కొద్ది సేపటికే స్టార్ హీరోలు తరలి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఉదయమే వచ్చి తన ఓటు వినియోగించుకున్నారు. పవన్ ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ 900 మంది ఉన్న ఈ అసోసియేషన్ ఎన్నికలకి ఇంత హడావిడి అవసరమా?? ఇలా తిట్టుకోవడం, వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం అవసరమా అని అన్నారు. లోకల్, నాన్ లోకల్ గా మాట్లాడటం కూడా తప్పే అని అన్నారు. ఓటు వేయడం మన బాధ్యత. ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలి అన్నారు. నేనే ఓటు వేయమని అందరికి చెప్తాను అలాంటిది నేను రాకుండా ఉంటానా అన్నారు. జనరల్ సర్పంచ్, ఎంపీటీసీ లాంటి ఎలక్షన్స్ లోనే మాట్లాడుకొని సహకరించుకొని ఏకగ్రీవం చేసుకుంటారు. అలాంటిది ‘మా’ ఎలక్షన్స్ కి ఇంత పోటీ అవసరమా అని వ్యాఖ్యానించారు. సున్నితంగా జరగాల్సిన ఎన్నికలు ఇలా రచ్చ చేశారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదు అని అన్నారు.