Pawan Kalyan : ‘యథా కాలమ్.. తథా వ్యవహారమ్’.. అంటున్న పవర్‌స్టార్..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా అప్‌డేట్..

Pawan Kalyan : ‘యథా కాలమ్.. తథా వ్యవహారమ్’.. అంటున్న పవర్‌స్టార్..

Pawan Kalyan

Updated On : September 2, 2021 / 3:13 PM IST

Pawan Kalyan: ఈ ఏడాది పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లేనంత స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్, జనసేన పార్టీ సభ్యులు, కార్యకర్తలు.. సెప్టెంబర్ 2న వరుసగా పవన్ నటిస్తున్న నాలుగు కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌తో.. సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలతో సోషల్ మీడియా షేక్ అవుతోంది.

Pawan Kalyan : పవర్‌స్టార్.. క్రేజ్‌కి కేరాఫ్..

ఇప్పటికే ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ బీభత్సంగా వైరల్ అవుతోంది. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హిస్టారికల్ ఫిలిం ‘హరి హర వీర మల్లు’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. ఇంతలోనే ముచ్చటగా మూడో అప్‌‌డేట్ రానే వచ్చింది. పవర్‌స్టార్ – స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు.

Bheemla Nayak Title Song : ‘భీం భీం భీం భీం భీమ్లానాయక్.. దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవక్’..

గన్, హైదరాబాద్ నగరాన్ని చూపిస్తూ.. ‘యథా కాలమ్.. తథా వ్యవహారమ్’.. అనే కొటేషన్‌తో డిజైన్ చేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పవన్ సన్నిహితుడు, ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రామ్ తాళ్లూరి ప్రొడక్షన్ నెం.9గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ‘అశోక్’ సినిమా నుండి సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసే అన్ని సినిమాలకూ (సైరా నరసింహా రెడ్డి) మినహా రైటర్‌గా వర్క్ చేసిన స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ సినిమాకు కథనందిస్తున్నారు.