యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికి పవన్ అభినందనలు

  • Published By: sekhar ,Published On : October 16, 2020 / 08:37 PM IST
యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికి పవన్ అభినందనలు

Updated On : October 16, 2020 / 8:58 PM IST

Pawan Kalyan: యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్, ప్రముఖ కళా దర్శకులు శ్ర్రీ ఆనంద్ సాయి ఇటీవలే ‘ధార్మిక రత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం స్వీకరించిన సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆనంద సాయిని అభినందించారు.హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆనంద్ సాయిని శాలువాతో సత్కరించారు.


శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణంలో ఎంతో నిష్టతో పాలుపంచుకోవడం ప్రశంసనీయం అన్నారు. ఆలయ నిర్మాణం, సంబంధిత వాస్తు అంశాలపై ఎంతో పరిశోధన చేసిన ఆయనకు ‘ధార్మిక రత్న’ పురస్కారం దక్కడం సముచితం అని చెప్పారు. నటుడు నర్రా శ్రీను ఈ సత్కారంలో పాల్గొని అభినందనలు తెలియచేశారు.


శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఇటీవల హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియమ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఆనంద్ సాయి ‘ధార్మిక రత్న’ పురస్కారాన్ని స్వీకరించారు.

Pawan Kalyan