Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ గా పవర్‌స్టార్..

‘భీమ్లా నాయక్ ఈజ్ బ్యాక్ ఆన్ డ్యూటీ’ అంటూ సెట్‌లో పవర్ స్టార్ పోలీస్ గెటప్‌లో ఉన్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్..

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ గా పవర్‌స్టార్..

Pk

Updated On : July 27, 2021 / 4:41 PM IST

Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాని పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్.కె.చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ లాక్‌డౌన్ తర్వాత తిరిగి స్టార్ట్ అయింది.

Nellore Kurrallu : పవన్ కళ్యాణ్ రేంజ్‌లో ‘వకీల్ సాబ్’ ఫైట్.. అదరగొట్టిన సింహపురి చిన్నోళ్లు..

పవర్ స్టార్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. పవన్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారని తెలియజేస్తూ.. ‘భీమ్లా నాయక్ ఈజ్ బ్యాక్ ఆన్ డ్యూటీ’ అంటూ సెట్‌లో పవర్ స్టార్ పోలీస్ గెటప్‌లో ఉన్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్. సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు అందిస్తున్నారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ లగ్జీరియస్ కార్.. కాస్ట్ ఎంతంటే..!

ప్రముఖ నటులు సముద్ర ఖని, మురళీ శర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, ఏ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు.