Pawan Kalyan : ఒక్కరోజులో వాళ్ళందరి నోర్లు మూయించిన పవన్ కళ్యాణ్..
పవన్ ఓ పక్క ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ చేస్తూ, మరోపక్క ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ..

Pawan Kalyan
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయినా ఒప్పుకున్నా సినిమాల కోసం, తనకు ఉన్న ఏకైక సంపాదన మార్గం కోసం, ఇచ్చిన మాట కోసం లేట్ అయినా అప్పుడప్పుడు సినిమాలకు డేట్స్ ఇస్తూ రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు. అలా ఎన్నో ఏళ్లుగా సాగుతున్న హరిహర వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ కి రెడీ అయింది.
అయితే పవన్ ఓ పక్క ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ చేస్తూ, మరోపక్క ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజల్లో తిరుగుతూ బిజీగా ఉన్నారు. దీంతో హరిహర వీరమల్లు ప్రమోషన్స్ కి టైం ఇవ్వలేదు. గతంలో కూడా పవన్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తప్ప వేరే ప్రమోషన్స్ కి వచ్చేవారు కాదు. కానీ పలువురు నెటిజన్లు, వేరే హీరోల ఫ్యాన్స్, ఆయన రాజకీయ ప్రత్యర్థులు పవన్ సినిమాని గాలికి వదిలేసాడని, హరిహర వీరమల్లు నిర్మాతని పట్టించుకోవట్లేదని, నిర్మాత కష్టాలు మర్చిపోయాడని, సినిమా ప్రమోషన్స్ కి రావట్లేదు అని తీవ్రంగా విమర్శలు చేసారు. ఓ రెండు రోజుల పాటు సోషల్ మీడియాలో, పలు వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ లో పవన్ హరిహర వీరమల్లు సినిమాని పట్టించుకోవట్లేదని, సినిమా రిలీజ్ కి ముందే ఫ్లాప్ అని విస్తృతంగా ప్రచారం చేసారు. అయితే అంత బిజీలో కూడా పవన్ హరిహర వీరమల్లు ప్రమోషన్స్ కి వచ్చారు.
Also Read : Pawan Kalyan – Anna Lezhneva : భార్యతో పవన్ కళ్యాణ్.. ఫొటోలు వైరల్..
ఓ పక్క నిన్నంతా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో ఉన్నా మధ్యలో ఉదయం మీడియా ప్రెస్ మీట్ కి హాజరయ్యారు, మళ్ళీ రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. ఒకే రోజులో పవన్ తన సినిమా కోసం రెండు ఈవెంట్స్ కి హాజరవడం ఇదే మొదటిసారి. అంతే కాకుండా వైజాగ్ లో ఈవెంట్ ఉంటుంది, అక్కడికి కూడా వస్తాను అని చెప్పారు. రేపు 23న వైజాగ్ లో ఈవెంట్ జరగనుంది. అలాగే మంగళగిరిలో కూడా ప్రెస్ మీట్ ఉంటుంది అని నిర్మాత చెప్పారు. దానికి కూడా పవన్ రానున్నారు. అసలు ఏ సినిమాకు చేయనంత ప్రమోషన్ పవన్ ఈ సినిమాకు చేస్తున్నారు ఇప్పుడు.
నిన్న రెండు ఈవెంట్స్ కి ఒకేసారి రావడం, ఈవెంట్స్ లో పవన్.. ఇది నా సినిమా, నా సినిమాని ఎలా వదిలేస్తాను, నా బాధ్యతల వల్ల, సమయం లేక ఎక్కువ ప్రమోషన్స్ కి రాలేదు. అంతే కానీ నేను నా సినిమాని ఎందుకు వదిలేస్తాను అంటూ ఫైర్ అయ్యారు. అలాగే నిర్మాతని వదిలేసాడు అన్నవాళ్లకు సమాధానంగా.. అదే నిర్మాతను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రతిపాదిచాను అని కూడా ప్రకటించారు పవన్. దీంతో ఒక్క రోజులో పవన్ స్పీచ్ లు, ఈవెంట్స్ కి రావడం తో మొత్తం సోషల్ మీడియా పవన్, హరిహర వీరమల్లు విజువల్స్ కనిపించాయి. సినిమాపై హైప్ భారీగా పెరిగింది. దీంతో ఫ్యాన్స్ పవన్ ని ఈ సినిమా విషయంలో విమర్శించిన వారందరికీ ఒక్క రోజులో నోరు మూయించాడు, కౌంటర్లు ఇచ్చాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా పవన్ ఇలా క్యాజువల్ లుక్స్ లో రోజంతా కనపడేసరికి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు.
Also Read : Director Krish : ఎక్కడా కనపడని క్రిష్.. ‘హరి హర వీరమల్లు’ పై పోస్ట్.. అసలు విషయం మాత్రం చెప్పలేదు..