మీడియా మిత్రులకు పవన్ దీపావళి శుభాకాంక్షలు

Pawan Kalyan Diwali wishes: ఈ దీపావళి ప్రతిఒక్కరి జీవితంలోని చీకట్లను పారద్రోలి, వెలుగులు విరజిమ్మాలని ఆశిస్తూ.. సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీడియా మిత్రులకు దివాళీ విషెస్ తెలిపారు.
‘‘దివ్వె పంచే వెలుగులే..
దీపావళి.
మీ కలం నుంచి వచ్చే
ప్రతి అక్షరమూ..
వేయి వెలుగుల దివ్వె అయి..
జగతికి శతకోటి కాంతులు పంచాలని..
మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
మీ
పవన్ కళ్యాణ్
అధ్యక్షులు, జనసేన’’.. అంటూ పవన్ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.
కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్, రవితేజ, సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయశాంతి, శృతి హాసన్, నాగ శౌర్య వంటి సినీ ప్రముఖులు తెలుగు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.