హీరో కార్తీ సారీ చెప్పడంపై పవన్ కల్యాణ్ ట్వీట్

అటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు.

హీరో కార్తీ సారీ చెప్పడంపై పవన్ కల్యాణ్ ట్వీట్

Updated On : September 24, 2024 / 8:47 PM IST

శ్రీవారి లడ్డూ గురించి తాను చేసిన వ్యాఖ్యలపై హీరో కార్తీ సారీ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ కల్యాణ్ ట్వీట్ చేసి అభినందించారు. కార్తీ వేగంగా స్పందించిన తీరును, మన సంప్రదాయాల పట్ల ఆయన చూపిన గౌరవాన్ని అభినందిస్తున్నానని తెలిపారు.

తిరుపతి, శ్రీవారి లడ్డూల వంటి పవిత్ర విషయాలకు సంబంధిన అంశాలపై కోట్లాది మంది భక్తుల భావోద్వేగాలు ముడిపడి ఉంటాయని చెప్పారు. అటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. దీని వెనుక ఎటువంటి ఇతర ఉద్దేశమూ లేకుండా దీన్ని కార్తీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానని తెలిపారు. లడ్డూపై వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి అనుకోకుండా వచ్చిందని తాను అర్థం చేసుకున్నానని చెప్పారు.

పబ్లిక్ ఫిగర్స్ గా తమ బాధ్యత ఐక్యత, గౌరవాన్ని పెంపొందించడమేనని తెలిపారు. ప్రత్యేకించి మనం ఎక్కువగా ఆరాధించే వాటి గురించి, మన సంస్కృతి, ఆత్మిక విలువల గురించి బాధ్యతను పెంచాలని భావిస్తున్నట్లు చెప్పారు. సినిమా ద్వారా ఈ స్ఫూర్తిని పొందుతూనే ఈ విలువలను పెంపొందించడానికి ఎల్లప్పుడూ కృషి చేద్దామని తెలిపారు.

అంకితభావం, ప్రతిభతో కార్తీ సినిమాని మరింత సుసంపన్నం చేస్తోన్న నటుడని, దీంతో ఆయన పట్ల తన అభిమానాన్ని కూడా తెలియజేస్తున్నానని చెప్పారు. సత్యం సుందరం సినిమా విడుదల సందర్భంగా ఆ సినిమా విజయవంతం కావాలని కార్తీకి, సూర్యకు, జ్యోతికకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని తెలిపారు.

TTD laddu row: ఏపీలో సెగలు పుట్టిస్తున్న హిందుత్వ సెంటిమెంట్