Pawan Kalyan In New Look For Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ఇప్పటికే క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్న పవన్, తమిళ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలతో పాటు దర్శకుడు హరీష శంకర్ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు పవన్.
Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ షురూ.. హరీష్ శంకర్ పోస్ట్ వైరల్!
ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ బుధవారం రోజున స్టార్ట్ అయినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా, ఈ సినిమాలో పవన్ లుక్‌కు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ పాత్ర అభిమానులకు కిక్కిస్తుందని.. ఇక ఈ సినిమాలో పవన్ ఓ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడట. ఇప్పటికే ఈ సినిమా కోసం పవన్ తన లుక్‌ను మార్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ రాగా, పవన్ సరికొత్త లుక్‌లో కనిపించాడు.
Ustaad Bhagat Singh : ఉస్తాద్‌లో పవన్‌కి విలన్‌గా మంత్రి మల్లారెడ్డి.. బ్రతిమాలిన హరీష్ శంకర్!
దీంతో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసమే తన లుక్‌ను మార్చాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీలలు హీరోయిన్లుగా నటిస్తుండగా, ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‍తో ప్రొడ్యూస్ చేయనుంది.