Pawan Kalyan : పవన్ అభిమానులు.. ఇకపై తమ హీరోని సినిమాల్లో మర్చిపోవాల్సిందేనా?

పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని సమాచారం.

Pawan Kalyan : పవన్ అభిమానులు.. ఇకపై తమ హీరోని సినిమాల్లో మర్చిపోవాల్సిందేనా?

Pawan Kalyan Leaves Movies Due to Politics Rumours goes viral

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయాలనుకునేవాళ్లు ప్రత్యామ్నాయం వెతుక్కోండి, పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకునేవాళ్లు ఆ అవకాశం రాదని మెంటల్ గా ప్రిపేర్ అయిపోయిపోండి, ఇక పవన్ డైలాగ్స్ చెబితే చూడాలని, ఆ పవర్ పంచ్ లను ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేస్కోవాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఇక ఆ ఛాన్స్ పెద్దగా ఉండదని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదంతా ఎందుకు అంటే పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని సమాచారం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకి వైబ్రేషన్, అగ్రెషన్, ఇన్‌స్పిరేషన్.. ఇలా చాలా ఉన్నాయంటారు పవన్ ఫ్యాన్స్. అసలు పవన్ కి అభిమానులు కాదు భక్తులు ఉంటారంటారు టాలీవుడ్ జనాలు. పవన్ సినిమా వస్తే థియేటర్స్ వద్ద పండగే. పవన్ అభిమానులు తమ హీరో సినిమా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే పవన్ రాజకీయాల్లోకి వచ్చే ముందు సినిమాలు మానేస్తానని ప్రకటించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. కానీ పార్టీని నడపడానికి డబ్బులు కావాలని మళ్ళీ సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు పవన్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టడంతో పవన్ దాదాపు సినిమాలకు గుడ్ బై చెప్పినట్టే అన్న టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.

ఎలాంటి పరిస్తితుల్లో అయినా వెన్నంటి నిలబడే అభిమానులతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా అన్ మ్యాచబుల్ క్రేజ్ ని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. అందుకే అటు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో బిజీ అయ్యారు. 10 ఏళ్లుగా పవర్ లో లేకపోయినా వెయిట్ చేసి ఇప్పుడు ఏకంగా మినిస్టర్ అయ్యారు. ఇంత పెద్ద బాధ్యతలు రావడంతో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ సినిమాల వైపు చూసే ప్రసక్తే లేదని తెలుస్తోంది.

Also Read : Tamilisai Soundararajan : బాలకృష్ణపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై పొగడ్తలు.. తెలుగు సూపర్ స్టార్ అంటూ..

ఆల్రెడీ పవన్ కళ్యాణ్ 6 నెలల నుంచి అసలు సినిమాలవైపే చూడడం లేదు. కమిట్ అయిన మూడు సినిమాలను ఎలా కంప్లీట్ చేద్దామా అని అనుకుంటూనే అప్పుడప్పుడు షూట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అంత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సినిమాలు చేస్తారా అన్నది మాత్రం డౌటే. ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలున్నాయి. హరిహరవీరమల్లు , ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ 3 సినిమాల ఫ్యూచర్ ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

OG సినిమాకు మాత్రం పవన్ ఒక రెండు వారాల డేట్స్ ఇస్తే షూట్ అయిపోద్ది కాబట్టి ఈ సినిమా మాత్రం లేట్ అయినా వచ్చే అవకాశం ఉంది. మిగిలిన రెండు సినిమాల పరిస్థితి మాత్రం తెలీదు. కానీ పవన్ పాలిటిక్స్ లో ఎంత బిజీగా ఉన్నా ప్రస్తుతం చేతిలో ఉన్న 3 సినిమాల్ని మాత్రం కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఎప్పుడన్నది క్లారిటీ లేదు. ఎప్పుడూ నిర్మాతల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చెయ్యడం, వాళ్లకి నష్టాలొస్తే తన రెమ్యూనరేషన్ తిరిగిచెయ్యడం లాంటివి చేశారు కాబట్టి ఉన్న 3 సినిమాల్ని మాత్రం కంప్లీట్ చేస్తారు పవన్.

Also Read : NTR : మెగా – నందమూరి ఫ్యామిలీలు అంతా గన్నవరం వెళ్తే.. ఎన్టీఆర్ మాత్రం హైదరాబాద్‌కు..

ఇక కొత్త సినిమాల గురించి మాత్రం మర్చిపోవాల్సిందే అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. పార్టీని బలోపేతం చేస్తూ పాలిటిక్స్ లో తనదైన మార్క్ చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక పవన్ సినిమాలు చేస్తారా అన్నది మాత్రం డౌటే అన్న మాటే ఎక్కువగా టాలీవుడ్ లో వినిపిస్తోంది. అందుకే పవన్ తో సినిమాలు చెయ్యాలనుకునేవాళ్లు ఇక ఆ ఆశలు వదలుకోవాల్సిందే అని అనుకుంటున్నారు.