Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి ఇంట్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫోటో.. గ‌మ‌నించారా..?

టాలీవుడ్‌లో ప్ర‌ముఖ యాంక‌ర్ల‌లో స్రవంతి ఒక‌రు

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి ఇంట్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫోటో.. గ‌మ‌నించారా..?

Pawan kalyan photo in Anchor Sravanthi Chokarapu house

Updated On : August 31, 2024 / 4:44 PM IST

టాలీవుడ్‌లో ప్ర‌ముఖ యాంక‌ర్ల‌లో స్రవంతి  ఒక‌రు. త‌న‌దైన మాట‌ల‌తో, ఎప్పటికప్పుడు తన అందాలతో టాలెంట్ చూపిస్తూండే ఆమెకు సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యాంక‌ర్‌గా, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా జ‌నాల్లో త‌నదైన ముద్ర వేసుకుంది. అనుకోకుండా నటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తరువాత కొన్ని సినిమాలలో నటించి, తరువాత టీవిలో హోస్ట్ గా చాలా ప్రోగ్రామ్స్ చేసింది.

ఇక శ్రావ‌ణ మాసం ఆఖ‌రి శుక్ర‌వారం కావ‌డంతో నిన్న వ‌ర‌ల‌క్ష్మి వ‌త్రం చేసుకుంది. ప‌ద్ద‌తిగా సంప్ర‌దాయంగా చీర‌లో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోల్లో కొన్నింటిలో గోడ‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఫోటో ఉంది. ఈ ఫోటోలు ఆమె ఇంట్లోవి కావ‌డం, ఆమె ప‌వ‌న్ ఫోటోలు ఇంట్లో పెట్టుకోవ‌డం వైర‌ల్‌గా మారింది. దీనిపై ప‌వ‌న్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. సాధారణ వ్యక్తులే కాదు సెలబ్రిటీలు సైతం పవన్ కల్యాణ్ అభిమానులు అని ఫ్యాన్స్ వెల్లడిస్తుండటం గమనార్హం.

JR NTR : అమ్మ కోరిక నెర‌వేర్చిన ఎన్టీఆర్.. త‌ల్లితో క‌లిసి ఆ గుడికి..

వాస్త‌వానికి తాను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి వీరాభిమాని అని సంగ‌తి ఓ సంద‌ర్భంలో స్రవంతి చొక్కారపు స్వ‌యంగా వెల్ల‌డించింది. అంతేకాదండోయ్ త‌న కొడుకుకి ప‌వ‌న్ కుమారుడి పేరు అయిన అకీరా నంద‌న్ అని కూడా పెట్టుకుంది. “నేను పవన్ కళ్యాణ్ కి మొదటి నుండీ చాలా పెద్ద అభిమానిని. అందుకే మా అబ్బాయికి పవన్ కళ్యాణ్ కుమారుడి పేరు అయిన అకీరా నందన్ అని పేరు పెట్టాను” అని చెప్పింది స్రవంతి. అంతేనా.. తాను నడుపుతున్న బోటిక్ పేరు కూడా పవన్ కళ్యాణ్ కుమారుడు పేరు వచ్చేట్టుగా అకీరా లేబిల్ అనే పేరు పెట్టింది.

 

View this post on Instagram

 

A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu)