Pawan Kalyan : 18 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన బాబాయ్ అబ్బాయి..
దాదాపు 18 ఏళ్ళ తరువాత మళ్ళీ పవన్ కళ్యాణ్.. తన ఆన్ స్క్రీన్ అబ్బాయితో కలిసి కనిపించాడు. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు..?

Pawan Kalyan photo with his on screen abbai gone viral
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలతో పాటు మధ్యలో కొన్ని ఈవెంట్స్ కి కూడా హాజరవుతూ అందర్నీ ఆనందపరుస్తూ వస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఈ హీరో ఒక తెలుగు టీవీ ఛానల్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకి చెందిన నటులు, దర్శకనిర్మాతలు కూడా అటెండ్ అయ్యారు. ఇక ఈ వేదిక పైనే దాదాపు 18 ఏళ్ళ తరువాత మళ్ళీ పవన్ కళ్యాణ్.. తన ఆన్ స్క్రీన్ అబ్బాయితో కలిసి కనిపించాడు. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు..?
పవన్ కళ్యాణ్ నటించిన ‘బాలు’ సినిమా అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో.. ఇప్పటి యువ హీరో ‘తేజ సజ్జా’ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం అందరికి తెలిసిందే. ఆ మూవీలో పవన్, తేజ బాబాయ్-అబ్బాయిగా నటించారు. సినిమా పెద్ద హిట్ కాకపోయినా ఆన్ స్క్రీన్ పై వీరిద్దరూ చేసిన అల్లరి ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. 2005లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఆ తరువాత వీరిద్దరూ కలిసి మళ్ళీ ఏ సినిమాలో కనిపించలేదు.
Also Read : Chiranjeevi : ఆ తమిళ స్టార్ డైరెక్టర్‌తో చిరు సినిమా.. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్..!
View this post on Instagram
ఇన్నాళ్లు తరువాత ఈ ఇద్దరు కలిసి ఒక ఫ్రేమ్ లో కనిపించడంతో ఆడియన్స్ కూడా.. ఆ ఫోటోలకు లైక్స్ కొడుతూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ఈ అబ్బాయి తేజ.. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కంటే ముందుగానే పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. తేజ నటిస్తున్న సూపర్ హీరో మూవీ హనుమాన్.. ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.