Pawan Kalyan Abou Karthikeya 2: పవన్ కళ్యణ్ నోట ‘కార్తికేయ-2’ మాట.. ఇదే కావాలట!
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ-2’ తెలుగునాటే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ మెచ్చుకుంటున్నారు. కాగా, తాజాగా ‘కార్తికేయ-2’పై ప్రశంసల వర్షం కురిపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
Pawan Kalyan Abou Karthikeya 2: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ-2’ తెలుగునాటే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ మెచ్చుకుంటున్నారు. కాగా, తాజాగా ‘కార్తికేయ-2’పై ప్రశంసల వర్షం కురిపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
Karthikeya 2 Creating Sensation In North Belt: బాలీవుడ్‌ను గడగడలాడిస్తున్న కార్తికేయ 2
జనసేన పార్టీకి సంబంధించిన ఓ సమావేశంలో పవన్ కళ్యాణ్ కార్తికేయ-2 మూవీపై ప్రశంసలు కురిపంచారు. సినిమా ఇండస్ట్రీలో తాను కోరుకున్న మార్పును కార్తికేయ-2 సినిమా సాధిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఇండియన్ బాక్సాఫీస్‌ను కార్తికేయ-2 చెడుగుడు ఆడుకోవడం అందరికీ గర్వకారణంగా ఉందని పవన్ ఈ సందర్భంగా అన్నారు. నిఖిల్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిన తీరు అద్భుతం అని ఆయన పేర్కొన్నారు.
Janasena Pawan Kalyan : దేశానికి మూడో ప్రత్యామ్నాయం ఉండాలి : పవన్ కళ్యాణ్
ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా గురించి, తన గురించి మాట్లాడటం తాను నమ్మలేకపోతున్నానంటూ నిఖిల్ తన ట్విట్టర్ అకౌంట్లో తెలిపాడు. కార్తికేయ-2 సినిమాపై పవన్ ప్రశంసలకు తామెప్పటికీ రుణపడి ఉంటామని నిఖిల్ అండ్ టీమ్ తెలిపారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కూడా కార్తికేయ-2 పేరును ప్రస్తావించడంతో దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
POWER STAR ??????
ayina matallo cinema gurunchi, na gurunchi vinadam ??❤️ #Karthikeya2 #Karthikeya2Hindi Thanks for ur words sir @PawanKalyan pic.twitter.com/1yaYA1siCq— Nikhil Siddhartha (@actor_Nikhil) August 21, 2022