LalaBheemla: భీమ్లా నాయక్ వీడియో ప్రోమో వచ్చేసింది..
టాలీవుడ్ క్రేజీ రీమేక్స్‌లో ఒకటి ‘భీమ్లా నాయక్’.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా..

Bheemla
LalaBheemla: టాలీవుడ్ క్రేజీ రీమేక్స్‌లో ఒకటి ‘భీమ్లా నాయక్’.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌గా వీడియో ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమో వీడియోలో పవన్ కళ్యాణ్ డైలాగ్‌ను కూడా చెప్పారు. మీకు హ్యాపీ కంగ్రాచ్యులేషన్స్ అండీ.. మీకు దీపావళి ముందుగానే వచ్చేసింది అంటూ.. మంచి మాస్ ఎలిమెంట్స్‌ని ప్రోమోలో చూపించారు. ఈ పూర్తి సాంగ్ 07 నవంబర్ 2021 విడుదల కానుంది.
పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తుండగా.. స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.
ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన పవన్, రానా గ్లింప్స్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న ‘భీమ్లా నాయక్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.