Pawan Kalyan : పవన్ కళ్యాణ్ OG సెట్స్ నుంచి వీడియో లీక్.. నెట్టింట వైరల్!

పవన్ కళ్యాణ్ OG సెట్స్ నుంచి వీడియో లీక్. ఆ వీడియోలో పవన్..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ OG సెట్స్ నుంచి వీడియో లీక్.. నెట్టింట వైరల్!

Pawan Kalyan video leak from OG movie sets gone viral

Updated On : August 25, 2023 / 2:20 PM IST

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ OG. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, శ్రియారెడ్డి ప్రధాన పాత్రలు కనిపించబోతున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ మూవీ సెట్స్ నుంచి ఏదోకటి లీక్ అవుతూనే ఉన్నాయి.

Nani : ఆ సినిమా అవార్డు గెలుచుకోనందుకు బాధ పడుతున్న నాని.. ఏ మూవీ తెలుసా..?

తాజాగా మూవీ నుంచి పవన్ కి సంబంధించిన ఒక వీడియో లీక్ అయ్యింది. ఆ వీడియోలో పవన్ 90’s మోడల్ డ్రెస్ లో కనిపిస్తున్నాడు. వైట్ షర్ట్ అండ్ బ్లాక్ పాంట్ లో పవన్ టక్ వేసి స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. పవన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో పాటు మరో షెడ్యూల్ లో పవన్ పాల్గొంటే చాలు తనకి సంబంధించిన చిత్రీకరణ పూర్తి అవుతుందని తెలుస్తుంది. అయితే తదుపరి షెడ్యూల్ కోసం పవన్ ఇండియా దాటి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Skanda : అబ్బాయి కోసం బాబాయ్.. రామ్ ‘స్కంద’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలయ్య..

కాగా ఈ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్దమవుతున్నారట. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజు మూవీ టీజర్ ని రిలీజ్ చేస్తారంటూ ఫిలిం వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. మరి సుజిత్ పవన్ అభిమానులకు ఎలాంటి బహుమతి రెడీ చేస్తున్నాడో చూడాలి. ఇది ఇలా ఉంటే, పవన్ సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లోకి అడుగుపెట్టనున్నాడు. ఒక ప్రత్యేక సెట్ ఒక పెద్ద షెడ్యూల్ ని దర్శకుడు హరీష్ శంకర్ ప్లాన్ చేశాడు.