Skanda : అబ్బాయి కోసం బాబాయ్.. రామ్ ‘స్కంద’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలయ్య..
రామ్, బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న ‘స్కంద’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలయ్య చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు.

Balakrishna guest for Ram Pothineni Sreeleela Skanda pre release event
Skanda : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), మాస్ డైరెక్టర్ బోయపాటి (Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘స్కంద’. శ్రీలీల (Sreeleela) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని కూడా చిత్ర యూనిట్ ఫుల్ స్వింగ్ లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ నుంచి ఇటీవల రెండు సాంగ్స్ ని రిలీజ్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు.
ఈ అబ్బాయి సినిమా కోసం బాబాయ్ బాలయ్య (Balakrishna) రంగంలోకి దిగుతున్నాడు. రేపు ఆగష్టు 26న బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా స్కంద ప్రీ రిలీజ్ థండర్ ఈవెంట్ జరగబోతుంది. ఈ కార్యక్రమంలోనే స్కంద ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఒక చిన్న గ్లింప్స్ మూవీ పై ఓ రేంజ్ బజ్ ని క్రియేట్ చేసిన రామ్ అండ్ బోయపాటి.. ట్రైలర్ తో ఎటువంటి హైప్ క్రియేట్ చేస్తారో చూడాలి. సెప్టెంబర్ 15న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
Jabardasth Comedian : జబర్దస్త్ కమెడియన్ నవసందీప్ అరెస్ట్.. కారణం ఏంటో తెలుసా..?
View this post on Instagram
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్ కి రామ్ అండ్ శ్రీలీల డాన్స్ మరో హైలైట్. వీరిద్దరి ఎనర్జీకి బాక్స్ ఆఫీస్ బద్దలు అయ్యేలా కనిపిస్తుంది. రామ్ కి ఇది మొదటి పాన్ ఇండియా రిలీజ్ మూవీ. మరి ఈ చిత్రం రామ్ సక్సెస్ అందుకుంటాడా..? లేదా..? చూడాలి.