Pawan Kalyan : యాక్టింగ్ చేస్తానో లేదో తెలీదు.. కానీ నిర్మాతగా.. మళ్ళీ ఆ సంస్థని బయటికి తీస్తున్న పవన్..
పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Pawan Kalyan
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాల చేస్తాడో లేదో అనే సందేహం అందరికీ ఉంది. అయితే అప్పటికే ఒప్పుకున్న సినిమాలు ఉండటంతో అవి మాత్రం ఎలాగైనా పూర్తిచేస్తాడని అంతా ఫిక్స్ అయ్యారు. హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు మాత్రం పూర్తిచేస్తున్నాడు పవన్. అయితే వీటి తర్వాత పవన్ మళ్ళీ సినిమాలు చేస్తారో లేదో సందేహమే.
పవన్ రంగంలోకి దిగి నిన్నటి నుంచి హరిహర వీరమల్లు ప్రమోషన్స్ చేస్తున్నాడు. తాజాగా నేడు మంగళగిరిలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. అలాగే పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ క్రమంలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నా ప్రయారిటీ రాజకీయాలే ప్రస్తుతం. సినిమా నా లైఫ్ లో భాగం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత యాక్టింగ్ చేస్తానో లేదో తెలీదు. కానీ నిర్మాతగా నా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద మాత్రం సినిమాలు చేస్తాను అని తెలిపారు. దీంతో పవన్ హీరోగా మళ్ళీ చేయడా అని పవన్ ఫ్యాన్స్ బాధ వ్యక్తం చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద చల్ మోహన్ రంగా సినిమాని నిర్మించారు. పలు సినిమాల్లో కొంత భాగస్వామ్యం వహించారు. మరి నిర్మాతగా పవన్ ఎలాంటి సినిమాలు చేస్తాడో చూడాలి.