Average Student Nani : బాబోయ్.. ఈ రొమాంటిక్ టీజర్ చూశారా? యావరేజ్ స్టూడెంట్ నాని టీజర్ రిలీజ్..

యావరేజ్ స్టూడెంట్ నాని టీజర్ ఫుల్ రొమాంటిక్ గా సాగింది.

Average Student Nani : బాబోయ్.. ఈ రొమాంటిక్ టీజర్ చూశారా? యావరేజ్ స్టూడెంట్ నాని టీజర్ రిలీజ్..

Pawan Kumar Average Student Nani Teaser Released

Updated On : July 28, 2024 / 7:33 AM IST

Average Student Nani Teaser : దర్శకుడు పవన్ కుమార్ ఇప్పుడు హీరోగా కూడా మారి ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో తనే హీరోగా చేస్తూ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నాడు. సాహిబా భాసిన్‌, స్నేహ మాల్వియ, వివియా సంత్‌లు హీరోయిన్లుగా, ఝాన్సీ, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో పవన్ కుమార్ శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌, రెండు మెలోడీ సాంగ్స్ ని విడుదల చేయగా తాజాగా టీజర్ రిలీజ్ చేసారు.

Also Read : Adhyanth Harsha : న్యూరో సైన్స్‌లో PHD చేసి.. ఇప్పుడు డైరెక్టర్ గా సినిమాల్లోకి..

యావరేజ్ స్టూడెంట్ నాని టీజర్ ఫుల్ రొమాంటిక్ గా సాగింది. ‘మనం ఆర్డినరీ అయినా మనం ట్రై చేసే అమ్మాయి ఎక్స్‌ట్రార్డినరీగా ఉండాలి’.. అంటూ హీరోయిన్స్ తో హీరో రొమాంటిక్ సన్నివేశాలు సినిమాలో ఎక్కువగానే ఉండబోతున్నట్టు చూపించారు. హీరో కాలేజీ కుర్రాడిలా కనిపించబోతున్నాడు. రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా ఈ టీజర్ సాగింది. మీరు కూడా ఈ రొమాంటిక్ టీజర్ ని చూసేయండి..