Hari Hara Veera Mallu: పవన్ రాక మరింత ఆలస్యం.. కారణం ఏంటంటే?

కరోనా ఉపద్రవం తర్వాత వకీల్ సాబ్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాంచి రీ ఎంట్రీ ఇచ్చాడు. అసలే ఎంతో ఆకలిగా ఉన్న పవన్ అభిమానులు వకీల్ సాబ్ ను అంత కఠిన పరిస్థితులలో కూడా భారీ సక్సెస్..

Hari Hara Veera Mallu: పవన్ రాక మరింత ఆలస్యం.. కారణం ఏంటంటే?

Hari Hara Veera Mallu

Updated On : October 21, 2021 / 3:00 PM IST

Hari Hara Veera Mallu: కరోనా ఉపద్రవం తర్వాత వకీల్ సాబ్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాంచి రీ ఎంట్రీ ఇచ్చాడు. అసలే ఎంతో ఆకలిగా ఉన్న పవన్ అభిమానులు వకీల్ సాబ్ ను అంత కఠిన పరిస్థితులలో కూడా భారీ సక్సెస్ కట్టబెట్టారు. ఇదే ఊపులో పవన్ కూడా వరస సినిమాలన మొదలు పెట్టాడు. పవన్ చేతిలో ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ప్రెస్టీజియస్ హిస్టారికల్ ప్రాజెక్ట్ ‘హరి హర వీర మల్లు’, సాగర్ చంద్ర దర్శకత్వంలో ‘భీమ్లా నాయక్’, హరీష్ శంకర్‌‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలున్నాయి.

Telugu Films Releases: టార్గెట్ డిసెంబర్.. అందరి చూపు ఈనెలపైనే!

వీటిలో భీమ్లానాయక్ వచ్చే సంక్రాంతికి విడుదల కానుండగా.. హరిహర వీరమల్లు షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది వరసగా పవన్ నుండి వస్తాయని అయన అభిమానులు ఎంతగానో ఆశించారు. అయితే.. భీమ్లానాయక్ తర్వాత హరిహర వీరమల్లు భారీ గ్యాప్ తీసుకొనేలా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు 60 శాతం షూటింగ్ పూర్తి కాగా మిగతా షూట్ నవంబర్ నెలలో ప్లాన్ చేసుకున్నారు.

Jr NTR: ఎక్స్‌పెరిమెంట్స్ జోలికెళ్లని తారక్.. పక్కా సేఫ్ గేమ్!

అయితే, ఇప్పుడు ఆ బ్యాలెన్స్ షూటింగ్ నవంబర్ లో కాదు డిసెంబర్ కు షిఫ్ట్ చేశారని వినిపిస్తుంది. దీనిపై యూనిట్ నుండి క్లారిటీ రావాల్సి ఉండగా అదే నిజమైతే.. వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమా రావడంపై అనుమానాలు వ్యక్తమవుతాయి. అసలే హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ సినిమా కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత ఆలస్యం అవుతాయి. కనుక ఈ సినిమా షూటింగ్ పై అసలు నిజమేంటన్నది యూనిట్ వర్గాల నుండి అధికారిక స్పందన రావాల్సి ఉంది. కాగా, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయకిగా నటిస్తుంది.