Mangalavaaram : పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’ టెలివిజన్ టీఆర్పీ అదిరిందిగా.. అన్నిచోట్లా హిట్టే..
ప్రస్తుతం మంగళవారం సినిమా డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మొదటిసారి మంగళవారం సినిమా టెలివిజన్ టీఆర్పీ అదరగొట్టింది.

Payal Rajput Ajay Bhupathi Mangalavaaram Movie gets Biggest TRP Rating in Television
Mangalavaaram : అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) మెయిన్ లీడ్ లో ఫిమేల్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కిన ‘మంగళవారం’ సినిమా గత సంవత్సరం నవంబర్ 17న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమా థియేటర్స్ లోనే భారీ విజయం సాధించింది. దాదాపు 5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 15 కోట్లకు పైగా వసూళ్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ కి ఓ కొత్త రోగాన్ని ఉన్నట్టు చూపించి చాలా బోల్డ్ గా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ.ఎం నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా రిలీజయింది ఈ సినిమా.
ప్రస్తుతం మంగళవారం సినిమా డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇటీవల ఫిబ్రవరి 11 సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానల్ లో మంగళవారం సినిమా మొదటిసారి టెలివిజన్ స్ట్రీమింగ్ అయింది. మొదటిసారి మంగళవారం సినిమా టీఆర్పీ చాలా ఎక్కువే వచ్చింది. స్టార్ హీరోల సినిమాలకు సమానంగా టీఆర్పీ తెచ్చుకుంది. మంగళవారం సినిమా ఏకంగా 8.3 టీఆర్పీ రేటింగ్ తెచ్చుకొని అదరగొట్టింది. దీంతో చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Rashmika Mandanna : రష్మిక భర్తకి అలాంటి క్వాలిటీస్ ఉండాలంట.. VD అంటూ అభిమాని చెప్తే..
కంటెంట్ ఉంటే సినిమాలు అన్ని ప్లాట్ ఫామ్స్ లోను హిట్ అవుతాయని మంగళవారం సినిమా మరోసారి నిరూపించింది. థియేటర్స్, ఓటీటీ, ఇప్పుడు టెలివిజన్.. అన్ని చోట్ల మంగళవారం సినిమా హిట్ కొట్టింది.
Despite no top-tier star cast, @DirAjayBhupathi's #Mangalavaaram scored 8.3 TRP in its first TV Premiere. This is extraordinary for a female-oriented film. The climax and a twist involving a female character have been loved by the viewers.
Mudhra Media Works & A Creative Works… pic.twitter.com/sKPsOMD592
— Teju PRO (@Teju_PRO) February 27, 2024