Thaina Fields : ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన కొన్ని నెలలకే చనిపోయిన నటి

పెరూకి చెందిన ఆ నటి అతి చిన్న వయసులో చనిపోవడం సంచలనం రేపుతోంది. తాను ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన కొన్ని నెలలకే ఆమె కన్నుమూసింది.

Thaina Fields : ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన కొన్ని నెలలకే చనిపోయిన నటి

Thaina Fields

Updated On : January 12, 2024 / 1:18 PM IST

Thaina Fields : అడల్ట్ ఫిల్మ్ స్టార్ థైనా ఫీల్డ్స్ 24 ఏళ్ల వయసులో కన్నుమూసారు. తాను ఇండస్ట్రీలో ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా వెల్లడించిన కొన్ని నెలలకే ఈ నటి చనిపోవడం సంచలనం రేపుతోంది.

Captain Miller : సంక్రాంతి బరి నుంచి తప్పుకొని.. రిపబ్లిక్ డేకి కెప్టెన్ మిల్లర్..

పెరూలో పాపులర్ అడల్ట్ స్టార్ థైనా ఫీల్డ్స్ కన్నుమూసారు . 24వ ఏట అతి చిన్న వయసులో చనిపోయారు. ఈ విషయాన్ని ఫీల్డ్స్ సన్నిహితులలో ఒకరైన అలెజాండ్రా స్వీట్ వెల్లడించారు. ఆమెను ఇష్టపడేవారంతా ఆమె కోసం ప్రార్థన చేయమని కోరారు. ఫీల్డ్స్ పనిచేసిన నిర్మాణ సంస్థలలో ఒకరైన మిల్కీ పెరూ థైనా ఫీల్స్‌కి సంతాపం తెలిపింది. థైనా ఫీల్డ్స్ లేదంటే నమ్మశక్యం కావడం లేదు. మిమ్మల్ని చూడాలని ఉంది.. అంటూ మిల్కీ పెరూ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది.

Mahesh Babu : సుదర్శన్ థియేటర్‌‌లో మహేష్ బాబు.. ఫ్యాన్స్‌తో గుంటూరు కారం..

థైనా ఫీల్డ్స్ కొంతకాలం క్రితం అడల్ట్ ఇండస్ట్రీలో తాను ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా వెల్లడించారు. తాను అడల్ట్ కంటెంట్‌లో నటించడం మొదలుపెట్టిన తర్వాత ఎదురైన ఇబ్బందులు బహిర్గతం చేశారు. తనను పనిలో పెట్టుకున్నవారంతా వారు కోరుకున్నది చేయాలని భావించారని.. మహిళలు అడల్ట్ కంటెంట్‌లో నటించడం ఎంతో కష్టమని ఆమె చెప్పారు. ఈ ఆరోపణలు చేసిన కొన్ని నెలలకే థైనా ఫీల్డ్స్ ఇంట్లో చనిపోయారు. మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.