Adipurush : ఢిల్లీ హైకోర్టులో ఆదిపురుష్‌ పై పిటిషన్.. రామయాణాన్ని హేళన చేశారంటూ హిందూసేన అధ్యక్షుడు!

ప్రభాస్ ఆదిపురుష్ మూవీ పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. హిందూ సేన’ అధ్యక్షుడు విష్ణు గుప్తా.. రామాయణాన్ని అగౌరవపరిచేలా, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా ఉందంటూ పేర్కొన్నారు.

Adipurush : ఢిల్లీ హైకోర్టులో ఆదిపురుష్‌ పై పిటిషన్.. రామయాణాన్ని హేళన చేశారంటూ హిందూసేన అధ్యక్షుడు!

Petition filed on Prabhas Adipurush movie in delhi court

Updated On : June 17, 2023 / 7:51 PM IST

Prabhas Adipurush : రాముడిగా ప్ర‌భాస్‌(Prabhas), సీత‌గా కృతి స‌న‌న్(Kriti Sanon), రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) న‌టించిన సినిమా ఆదిపురుష్‌. రామాయణ కథాంశంతో వచ్చిన ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయ్యిన ఈ చిత్రం.. ఆడియన్స్ కి పెద్ద షాక్ ఇచ్చింది. రామాయణ కథ అని చెప్పి దర్శకుడు వక్రీకరించే ప్రయత్నం చేశాడని విమర్శలతో పాటు, రామరావణ పాత్రలను చూపించిన విధానం పై భారీ ట్రోలింగ్ ని ఎదురుకుంటున్నాడు ఓం రౌత్.

Adipurush : ఆ రికార్డులో ఇండియాలోనే ఏకైక స్టార్ ప్రభాస్.. మూడు సినిమాలతో మొదటిరోజు!

తాజాగా ఈ సినిమా పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. హిందూ సేన’ అధ్యక్షుడు విష్ణు గుప్తా దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో.. వాల్మీకి రామాయణం మరియు తులసీదాస్ రామచరిత మానస్‌లోని పాత్రల వర్ణనకు.. ఆదిపురుష్ లో చూపించిన పాత్రలకు చాలా భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. బ్రాహ్మణుడైన రావణుడిని గడ్డంతో చూపించడం, ఆంజనేయుడు పాత్ర భారతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించేలా లేదంటూ ఆరోపించారు. రామాయణాన్ని అగౌరవపరిచేలా, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా ఉందంటూ వ్యాఖ్యానించారు.

Adipurush: ఆదిపురుష్ సినిమా కాంట్రవర్సీలోకి మహా సీఎంను లాగిన నెటిజెన్.. ఫోన్ నంబర్ షేర్ చేయమంటూ ఝలక్ ఇచ్చిన థానే పోలీస్

దీంతో మూవీ టీం ఇప్పుడు చిక్కులో పడినట్లు అయ్యింది. కాగా ఈ సినిమాలో సీత పాత్ర విషయంలో కూడా నేపాల్ లో వివాదం చెలరేగింది. ఆదిపురుష్ లో సీత మాత జన్మస్థలం భారతదేశం అంటూ చెప్పుకొచ్చారు. ఆ మాటలు పై నేపాల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీత మాత జన్మస్థలం నేపాల్ అని, దానిని ఎలా మారుస్తారు అంటూ ఖాట్మండు మేయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నేపాల్ సెన్సార్ బోర్డు కూడా ఆ డైలాగ్ తీసేయకుంటే సినిమా విడుదలకు అనుమతి ఇచ్చేది లేదంటూ పేర్కొనడంతో మూవీ టీం ఆ మాటల్ని తొలిగించారు.