పిఎమ్ నరేంద్రమోదీ ఫస్ట్ లుక్

పిఎమ్ నరేంద్రమోదీ ఫస్ట్ లుక్ రిలీజ్

  • Published By: sekhar ,Published On : January 7, 2019 / 11:45 AM IST
పిఎమ్ నరేంద్రమోదీ ఫస్ట్ లుక్

పిఎమ్ నరేంద్రమోదీ ఫస్ట్ లుక్ రిలీజ్

గతకొంత కాలంగా బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. ఇప్పుడు మరో ప్రయోగాత్మక బయోపిక్‌కి రంగం సిద్ధమయ్యింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోపిక్, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ఈ నెల 11న రిలీజవుతుండగా, ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా ఒక సినిమా తెరకెక్కబోతుంది. పిఎమ్ నరేంద్రమోదీ పేరుతో రూపొందబోయే నరేంద్రమోదీ బయోపిక్‌లో, ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, నరేంద్ర మోదీగా నటిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా టైటిల్‌తో పాటు, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు. మహారాష్ట్ర సీఎమ్ ఫడ్నవీస్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. 
 

బ్యాక్‌గ్రౌండ్‌లో జాతీయ పతాకం రెపరెపలాడుతుండగా, నరేంద్రమోదీ నిలబడి ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. దేశ భక్తే నా శక్తి అనే క్యాప్షన్ ఇచ్చారు. హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చెయ్యడం విశేషం. వివేక్ ఒబెరాయ్ మేకప్ పరంగా బాగా కష్ట పడ్డాడు. 23 జాతీయ భాషల్లో నరేంద్రమోదీ బయోపిక్, పిఎమ్ నరేంద్రమోదీ సినిమాని విడుదల చెయ్యబోతున్నారు. ఈ నెల 15నుండి రెగ్గులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాకి దర్శకత్వం : ఒమంగ్ కుమార్, నిర్మాతలు : సురేష్ ఒబెరాయ్, సందీప్ ఎస్‌సింగ్.