Nava Sandeep : ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ.. జబర్దస్త్ ఆర్టిస్ట్, సింగర్ నవ సందీప్ పై కేసు నమోదు..

ఫోక్ సింగర్ గా, ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నవ సందీప్ ప్రస్తుతం జబర్దస్త్ లో గల్లీ బాయ్స్ సద్దాం టీంలో కనిపిస్తున్నాడు. తాజాగా నవ సందీప్ పై కేసు నమోదయింది.

Nava Sandeep : ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ.. జబర్దస్త్ ఆర్టిస్ట్, సింగర్ నవ సందీప్ పై కేసు నమోదు..

Police case filed on Jabardasth Comedian Singer Nava Sandeep cheated a girl with love

Updated On : August 20, 2023 / 12:41 PM IST

Nava Sandeep :  జబర్దస్త్ నుంచి ఎంతో మంది ఆర్టిస్టులు పరిచయమవుతున్నారు. సీనియర్స్ వెళ్లిపోవడంతో ఇటీవల కొత్త కొత్త వాళ్లకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి జబర్దస్త్ లో. ఫోక్ సింగర్ గా, ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నవ సందీప్ పటాస్, అదిరింది, కామెడీ స్టార్స్.. లాంటి పలు కామెడీ షోలలో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ లో గల్లీ బాయ్స్ సద్దాం టీంలో కనిపిస్తున్నాడు. అలాగే ఓ యూట్యూబ్ ఛానల్ లో ఫోక్ పాటలతో అలరిస్తున్నాడు సందీప్.

తాజాగా నవ సందీప్ పై కేసు నమోదయింది. గత కొన్నాళ్లుగా ప్రేమించి, శారీరికంగా వాడుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడుగుతుండటంతో మొహం చాటేస్తున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Renu Desai : రాజమౌళి సినిమా కోసం నార్వే వెళ్లిన రేణు దేశాయ్, అకిరా.. రాజమౌళిపై రేణు దేశాయ్ స్పెషల్ పోస్ట్..

ఆ యువతి చెప్పిన దాని ప్రకారం.. 2018లో ఆ యువతికి పరిచయమైన నవ సందీప్ వాట్సాప్ చాట్ లతో మరింత దగ్గరయ్యాడు. అనంతరం ప్రేమ అని చెప్పి ఇద్దరూ హైదరాబాద్ లో తిరిగారు. శారీరికంగా కూడా కలిశారు. గత నాలుగేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడుగుతుండటంతో నవ సందీప్ స్పందించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే దీనిపై నవ సందీప్ ఇంకా స్పందించలేదు.