మా నాన్న నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు.. నా పిల్లలు చెప్పారని మరో పెళ్లి చేసుకుంటున్నా: పూజా బేడీ

బాలీవుడ్ నటి పూజా బేడీ ట్రెండింగ్ గా మారింది. ఇటీవల ఆమె టైమ్స్ ఆఫ్ ఇండియా అనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి, పిల్లలతో తనకున్న రిలేషన్ షిప్ గురించి మాట్లాడటమే ఇంట్రస్టింగ్ టాపిక్ అయింది. గతంలో ఫర్హాన్ ఫర్నిచర్ వాలాను 1994లో పెళ్లాడిన పూజా బేడీ 2003లోనే ఆ రిలేషన్ కు గుడ్ బై చెప్తూ విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్న ఆమెను చూసి పిల్లలే పెళ్లి చేసుకోమంటూ సలహా ఇచ్చారట. అందుకే తను మానెక్ కాంట్రాక్టర్ తో ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేసుకున్నారు.
‘నాకు పెళ్లి చేసుకోవాలని ఉన్న దానికంటే నా పిల్లలకే నాకో తోడు తీసుకురావాలని ఆశపడుతున్నారు. ఓ అద్భుతమైన వ్యక్తిని జీవితాల్లోకి వస్తున్నాడని ఆశిస్తున్నారు. నా మాజీ భర్త గురించి వారికి పూర్తిగా తెలుసు. మానెక్ తో వారికి చాలా పరిచయమైంది. ఇంకా వారి తండ్రిని చూపిస్తూ.. ఆయనకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని’ చెప్తున్నారు.
అనుభవాలు జీవితాన్ని బెటర్ చేయాలి. చేదుమయం కాదు. మొదటి పెళ్లి వర్కౌట్ కాకపోతే రెండో వివాహాం చేసుకోవడానికి వెనుకాడకూడదు’ అని పూజా బేడీ అంటున్నారు. ‘నా తండ్రి నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నారు. అతను అద్భుతమైన వ్యక్తులను పెళ్లి చేసుకున్నాడు. నాకు తల్లి వరుస అయ్యే వారంతా అద్భుతమైన వ్యక్తులే. ఆ పెళ్లిళ్లు ఆయనలో కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చాయి’
పూజా బేడీ బాలీవుడ్ లోకి 1991వ సంవత్సరం సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. జో జీతా వొహీ సికందర్ సినిమాలో అమీర్ ఖాన్, ఆయేషా జుల్కాలతో పాటు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. బిగ్ బాస్ 5లో కాంట్రవర్షియల్ సెలబ్రిటీగా కూడా మారింది.