Pooja Hegde : పూజా హెగ్డేకి ఎలాంటి వరుడు కావాలో తెలుసా? పూజా వాళ్ళ అమ్మ చెప్పేసింది..
మాతృ దినోత్సవం సందర్భంగా పూజా తన తల్లి లత హెగ్డేతో కలిసి ఓ బాలీవుడ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు తల్లీకూతుళ్లు.

Pooja Hegde dream boy qualities said by her mother
Lata Hegde : పూజా హెగ్డే(Pooja Hegde) సౌత్ లో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే బాలీవుడ్(Bollywood) లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. కానీ బాలీవుడ్ లో పూజా హెగ్డే సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే సల్మాన్(Salman Khan) సరసన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా పరాజయం పాలైంది. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఓ బాలీవుడ్ సినిమా, మహేష్ – త్రివిక్రమ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి.
ఆదివారం నాడు మాతృ దినోత్సవం సందర్భంగా పూజా తన తల్లి లత హెగ్డేతో కలిసి ఓ బాలీవుడ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు తల్లీకూతుళ్లు. ఈ నేపథ్యంలో యాంకర్ పూజాకు ఎలాంటి భర్త కావాలి అని అడగగా ఆమె తల్లి లత సమాధానమిస్తూ.. తనని అన్ని రకాలుగా అర్ధం చేసుకునే వ్యక్తి గురించి ఎదురు చూస్తోంది. వివాహబంధం కలకలం నిలిచి ఉండాలంటే భార్య, భర్త ఇద్దరి కష్టం ఉండాలి. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. పూజా చాలా సున్నిత మనస్కురాలు. తన ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకునే వ్యక్తి కావాలి. తన కెరీర్ కి కూడా సపోర్ట్ గా నిలబడాలి. అలాంటి అబ్బాయినే పూజా హెగ్డే కోరుకుంటుంది అని తెలిపింది.
Ashwini Dutt : ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరంలో మాది అర్ధ శత జయంతి.. ఇప్పటికి ప్రాజెక్టు K తీస్తున్నా..
మరి పూజా హెగ్డేని చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవరో చూడాలి మరి. ఇక ఇదే ఇంటర్వ్యూలో పూజా తన తల్లితో ఆమెకు ఉన్న అనుబంధాన్ని పంచుకుంది. చిన్నప్పటి జ్ఞాపకాలను కూడా షేర్ చేసుకుంది.