Pooja Hegde : బర్త్‌డే రోజు మాల్దీవ్స్ కి చెక్కేసిన బుట్టబొమ్మ.. సముద్రంలో హాయిగా పడుకొని..

నేడు పూజాహెగ్డే పుట్టిన రోజు కావడంతో ముందుగానే తన స్నేహితులతో కలిసి మాల్దీవ్స్(Maldives) కి చెక్కేసింది ఈ బుట్టబొమ్మ.

Pooja Hegde : బర్త్‌డే రోజు మాల్దీవ్స్ కి చెక్కేసిన బుట్టబొమ్మ.. సముద్రంలో హాయిగా పడుకొని..

Pooja Hegde Enjoying Her Birthday in Maldives Shares Photos and Videos

Updated On : October 13, 2023 / 11:00 AM IST

Pooja Hegde : తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజాహెగ్డే వరుస సినిమాలు చేస్తూనే బాలీవుడ్ కి చెక్కేసింది. ఇటీవల టాలీవుడ్ లో చేతిలో ఉన్న ఆఫర్లని బాలీవుడ్ సినిమాల కోసం కూడా వదులుకొని పూజా బాగా వైరల్ అయింది. ప్రస్తుతం ఓ బాలీవుడ్(Bollywood) సినిమా చేస్తుంది పూజా హెగ్డే.

నేడు పూజాహెగ్డే పుట్టిన రోజు కావడంతో ముందుగానే తన స్నేహితులతో కలిసి మాల్దీవ్స్(Maldives) కి చెక్కేసింది ఈ బుట్టబొమ్మ. మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. సముద్రం ఒడ్డున నెట్ తో ఏర్పాటు చేసిన బెడ్ పై ప్రశాంతంగా పడుకున్న ఓ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ప్రస్తుతం అందుబాటులో లేను అని పోస్ట్ చేసింది.

Also Read : Chiranjeevi : నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తే.. అంతా కలిసి నన్ను బ్యాన్ చేశారు.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..

దీంతో పూజాహెగ్డే షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇక అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పూజా హెగ్డేకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. మాల్దీవ్స్ లో పుట్టిన రోజుని ఎంజాయ్ చేయడానికి వెళ్లిన పూజా ఎన్ని ఫోటోలు షేర్ చేస్తుందో చూడాలి. మాల్దీవ్స్ బీచ్‌ల వద్ద మన సెలబ్రిటీలు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటారు. గతంలో పూజా కూడా మాల్దీవ్స్ లో బోలెడన్ని బికినీ ఫోటోలు షేర్ చేసింది. ఈ పుట్టినరోజుకి ఇంకెన్ని ఫొటోలతో అభిమానులకు ట్రీట్ ఇవ్వనుందో చూడాలి.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)