Pooja Hegde : అందరూ కోట్లల్లో తీసుకుంటే.. పూజా హెగ్డే లక్షల్లో.. మరీ అంత తక్కువా?

స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేస్తే ఒక సినిమాకు తీసుకునేంత రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు.

Pooja Hegde : అందరూ కోట్లల్లో తీసుకుంటే.. పూజా హెగ్డే లక్షల్లో.. మరీ అంత తక్కువా?

Pooja Hegde

Updated On : July 18, 2025 / 5:51 PM IST

Pooja Hegde : ఇప్పుడు హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ కూడా పెరిగాయి. హీరోయిన్స్ కూడా రెండు సినిమాలు హిట్స్ పడ్డాయంటే కోటి పైనే తీసుకుంటున్నారు. ఇక స్టార్ హీరోయిన్స్ అయితే మూడు కోట్ల నుంచి తీసుకుంటున్నారు. కొంతమంది హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేస్తూ కోట్లల్లో రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. పుష్ప సినిమాలో సమంత ఐటెం సాంగ్ కి మూడు కోట్లు, శ్రీలీల రెండు కోట్లు తీసుకున్నారని సమాచారం.

ఇలా స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేస్తే ఒక సినిమాకు తీసుకునేంత రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. అయితే తాజాగా పూజా హెగ్డే మాత్రం కేవలం లక్షల్లోనే తీసుకుందట. పూజాహెగ్డే రజినీకాంత్ కూలి సినిమాలో ఓ చిన్న పాత్ర చేస్తుంది. ఈ సినిమా నుంచి ఇటీవలే పూజాహెగ్డే మోనికా అనే స్పషల్ సాంగ్ రిలీజయి పెద్ద హిట్ అయింది. ఈ సాంగ్ లో పూజా అదిరిపోయే స్టెప్పులతో అందర్నీ మెప్పించింది.

Also Read : Tron: Ares : తెలుగులో కూడా ‘ట్రాన్: ఏరీస్’.. ట్రైలర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే..

అయితే ఈ పాటకు గాను పూజాహెగ్డే కేవలం 70 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. పూజా హెగ్డే అంత తక్కువ తీసుకుందా, అది కూడా స్పెషల్ సాంగ్ కి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. పూజాహెగ్డేకి హిట్ పడి మూడేళ్లు అవుతుంది. మధ్యలో సౌత్ వదిలేసి బాలీవుడ్ కి వెళ్లి అన్ని ఫ్లాప్స్ చూసింది. చేతిలో సినిమాలు కూడా తగ్గిపోయాయి.

అందుకే పూజా హెగ్డే డిమాండ్ చేయకుండా వాళ్లు చెప్పిన రెమ్యునరేషన్ కి ఓకే చెప్పిందని సమాచారం. ప్రస్తుతం అయితే పూజా నాలుగు సినిమాల్లో చేస్తుంది. అందులో ఓ రెండు సినిమాలు హిట్ అయినా ఫుల్ ఫామ్ లోకి వచ్చేస్తుంది అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఈ రెమ్యునరేషన్ కేవలం సాంగ్ వరకే అని ఫుల్ సినిమాకైతే పూజా రెండు నుంచి మూడు కోట్లు తీసుకుంటుందని టాక్.

Also Read : Kireeti : ఒక్క మాల్ లో ప్రమోషన్ కోసమే ఏకంగా 25 లక్షలు.. ఈ హీరో లాంచింగ్ కోసం కోట్లు ఖర్చుపెట్టి ప్రమోషన్స్..