Actress Pooja Hegde: రెమ్యునిరేషన్ పెంచినా పూజానే కావాలంట.. హయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే టక్కున చెప్పే పేరు పూజా హెగ్డే.

Actress Pooja Hegde: రెమ్యునిరేషన్ పెంచినా పూజానే కావాలంట.. హయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్!

Pooja Hegde

Updated On : July 9, 2021 / 12:17 AM IST

Pooja Hegde: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే టక్కున చెప్పే పేరు పూజా హెగ్డే. అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలతో వరుస హిట్లు అందుకున్న ఈ అమ్మడు క్రేజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ మాత్రం తగ్గట్లేదు. క్రేజ్‌కి తగ్గట్టుగానే ఈ భామ ఒక్కసారిగా రెమ్యునరేషన్ కూడా పెంచేసిందంట.

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలను చేస్తూ.. ఫుల్ బిజీగా మారిపోయిన పూజా హెగ్డే.. యంగ్ హీరోలకు బెస్ట్ చాయిస్ అయిపోయింది. బాలీవుడ్‌లో రణవీర్ సింగ్, డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబోలో వస్తున్న సర్కాస్ సినిమాలో కూడా నటిస్తోండగా.. కొత్త సినిమాలకు ఏకంగా మూడున్నర కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తుందట. అయినా కూడా అంత ఇచ్చి ఆమెనే హీరోయిన్‌గా పెట్టేసుకుంటున్నారంట నిర్మాతలు. ప్రస్తుతం పూజా హెగ్డే ఆరు సినిమాల్లో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

తమిళ స్టార్ విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న బీస్ట్ చిత్రంతో కోలీవుడ్‏లో అడుగుపెడుతున్న పూజ.. మెగాస్టార్ చిరంజీవి, కాజల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఆచార్యలోనూ చరణ్ పక్కన కనిపించబోతుంది. ఇంతమొత్తంలో పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ఈమెనే అని ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)