Radhe Shyam: ఆయనకు సిగ్గెక్కువ.. ప్రభాస్‌తో కెమిస్టీపై పూజా!
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా రాధే శ్యామ్. దర్శకుడు రాధ కృష్ణ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి..

Radhe Shyam
Radhe Shyam: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా రాధే శ్యామ్. దర్శకుడు రాధ కృష్ణ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి రెడీగా ఉండగా ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అయితే.. ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్న ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య కెమిస్ట్రీ లోపించింది. ముంబై ప్రమోషన్ కార్యక్రమాలలో లోపించిన కెమిస్ట్రీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Radhe Shyam: చల్లారని కోల్డ్ వార్.. ఎడమొహం పెడమొహంగా ప్రభాస్-పూజా?
రాధేశ్యామ్ మూవీ షూటింగ్ టైమ్ లో పూజా, ప్రభాస్ కి మధ్య గొడవ జరిగిందని.. కొన్నిరోజులు షూటింగ్ కూడా ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమి లేదని అప్పట్లో రాధేశ్యామ్ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కానీ రీసెంట్ వ్యవహారం చూస్తుంటే ఒకరంటే ఒకరికి పడట్లేదని మళ్ళీ ప్రచారం జరిగింది. రీసెంట్ ప్రెస్ మీట్ లో కనీసం ఒకరితో ఒకరు మాట్లాడకోకపోవడం, ఎడమొహం పెడమొహంగా ఉండడం.. ఇద్దరి మధ్య కోపం ఇంకా చల్లారలేదా అనే అనుమానాలను లేవనెత్తాయి.
Radhe Shyam: టైటానిక్‌ను మించి.. విజువల్ వండర్‌గా రాధేశ్యామ్?
అయితే, తాజాగా తమిళనాడులో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఉత్సాహంగా పాల్గొని మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. లోపించిన కెమిస్ట్రీ విషయాన్నే అక్కడ మీడియా గుర్తుచేయగా.. ఆయనకు సిగ్గు ఎక్కువని, అందుకే ఆయనతో కలవడానికి టైం పడుతుందని కానీ ఒకసారి కలిసిపోతే మాత్రం ఆయనంత స్వీట్ పర్సన్ మరొకరు లేరని పూజా తెలిపింది. ఇక ప్రభాస్ కూడా ఈ సినిమాలో ఆమెతో కెమిస్ట్రీ బాగా సెటయ్యిందని చెప్పారు. మొత్తంగా ఇద్దరి మధ్య వివాదాలనే కథనాల్లో నిజంలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.