Pooja Hegde : వెండితెరపై బుట్టబొమ్మ పని అయిపోయిందా? ఓటీటీ బాట పట్టిన పూజా హెగ్డే?
ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ చేతిలో ఒక్క హిందీ సినిమా మాత్రమే ఉందని తెలుస్తుంది. తాజాగా పూజా హెగ్డే గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.

Pooja Hegde Ready to do OTT Series due to less Movie Chances Rumours goes Viral
Pooja Hegde : ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పూజా హెగ్డే ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయింది. అలవైకుంఠపురంలో సినిమాతో స్టార్ హీరోయిన్ స్థాయి దక్కించుకుంది. కానీ అది ఎక్కువరోజులు నిలబెట్టుకోలేకపోయిందనే ఇండస్ట్రీ వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు. అలవైకుంఠపురంలో సినిమాతో బుట్టబొమ్మలా(Buttabomma) మారిన పూజా హెగ్డే బాలీవుడ్(Bollywood) లో ఛాన్సులు రాగానే సౌత్ లో కొన్ని సినిమాలు వదిలేసి వెళ్లిపోయిందని వార్తలు వచ్చాయి.
సౌత్ లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్, మహేష్ గుంటూరు కారంతో పాటు ఇంకొన్ని సినిమాలు కూడా ఏవో కారణాలతో వదిలేసింది పూజా హెగ్డే. బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసినా ఆ రెండూ ఆశించినంత విజయం సాధించలేదు. దీంతో అటు బాలీవుడ్, ఇటు సౌత్ లో పూజా హెగ్డేకు సినిమా ఛాన్సులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ చేతిలో ఒక్క హిందీ సినిమా మాత్రమే ఉందని తెలుస్తుంది. తాజాగా పూజా హెగ్డే గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.
పూజా హెగ్డే కూడా ఇటీవల అందరి స్టార్స్ లాగే ఓటీటీ బాట పట్టనుంది. ఇన్నాళ్లు ఓటీటీ ఆఫర్స్ వచ్చినా సినిమాల్లో బిజీగా ఉండటంతో పూజా వాటిని తిరస్కరించిందట. కానీ ఇప్పుడు ఎక్కువ సినిమాలు లేకపోవడంతో ఓ ఓటీటీ ఆఫర్ కి ఓకే చెప్పింది. నెట్ ఫ్లిక్స్ లో తమిళ్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఓ హారర్ థ్రిల్లర్ సిరీస్ లో పూజా చేయబోతున్నట్టు సమాచారం. తమిళ్ లో దీనిపై వార్తలు కూడా వచ్చాయి. కానీ పూజా అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి పూజా హెగ్డే ఓటీటీలో చేస్తుందా లేదా సినిమాల్లో మళ్ళీ బిజీ అవుతుందా చూడాలి.