Poonam Kaur: మన ఇంటికోసం పక్కంటిని కూల్చాలా.. పూనమ్ సంచలన పోస్ట్.. సమంత గురించేనా?

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్(Poonam Kaur) గురించి చాలా మందికి తెలుసు. ఆమధ్య కొన్ని సినిమాల్లో నటించి కనుమరుగైపోయింది. ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది.

Poonam Kaur: మన ఇంటికోసం పక్కంటిని కూల్చాలా.. పూనమ్ సంచలన పోస్ట్.. సమంత గురించేనా?

Poonam Kaur makes a sensational post about Samantha second marriage

Updated On : December 2, 2025 / 10:17 AM IST

Poonam Kaur; టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్(Poonam Kaur) గురించి చాలా మందికి తెలుసు. ఆమధ్య కొన్ని సినిమాల్లో నటించి కనుమరుగైపోయింది. ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు నచ్చిన, నచ్చని విషయాల గురించి సోషల్ మీడియాలో డైరెక్ట్ గా స్పందిస్తుం ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గురించి ఈమె చేసే కామెంట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా మరోసారి సంచలన పోస్ట్ పెట్టింది ఈ బ్యూటీ. ఆ పోస్ట్ లో ఆమె.. మన ఇల్లు బాగుండాలని పక్క ఇల్లు కూలేచేయడం కరక్ట్ కాదు. అది కూడా ఒక శక్తివంతమైన, బాగా చదువుకున్న, అత్యంత ప్రాధాన్యత గల మనిషి చాలా చేయడం బాధాకరం. డబ్బు ఏదైనా చేయిస్తుంది”అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Pragya Jaiswal: బికినీ వేసుకొని బీచ్ లో.. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ప్రగ్యా.. ఫొటోలు

ఇక ఈ పోస్ట్ చూసిన చాలా మంది పూనమ్ సమంత గురించే ఇండైరెక్ట్ గా పోస్ట్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత రెండో పెళ్లి చేసుకున్న స్టార్ డైరెక్టరో రాజ్ నిడిమోరుకి కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం. ఆయన కూడా తన భార్యకి విడాకులు ఇచ్చి సమంతను రెండో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా రాజ్ భార్య కూడా బరితెగించిన వాళ్ళు ఇలాగే చేస్తారు అనే పోస్ట్ పెట్టింది. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు అదే అర్థం వచ్చేలా పూనమ్ చేసిన పోస్ట్ కూడా సంచలనంగా మారింది. మరి ఈ పోస్టులపై సమంత గానే, ఆమె భర్త రాజ్ గాని ఎలా స్పందిస్తారు? అసలు స్పందిస్తారా అనేది చూడాలి.

ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత, దర్శకుడు రాజ్‌ నిడిమోరును ఆమె సోమవారం ఉదయం వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో కొలువైన లింగ భైరవి దేవి ఆలయంలో ఈ జంట వివాహం చేసుకున్నారు. అయితే, చాలా నిరాడంబరంగా, అతికొద్ది మంది సన్నిహితుల మధ్య ఈ పెళ్లి గోప్యాంగా జరిగింది. అనంతరం పెళ్ళికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అధికారికంగా ప్రకటించింది సమంత.