Poonam Pandey : నేను బ్రతికే ఉన్నా..అందుకోసమే నేను చనిపోయినట్లు పోస్టు పెట్టా

పూనమ్ పాండే చనిపోలేదు. చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. సోషల్ మీడియాలో తనకి ఏ అనారోగ్యం లేదని.. క్యాన్సర్ పై అవగాహన కల్పించడంలో భాగంగా ఇదంతా చేసినట్లు వెల్లడించారు.

Poonam Pandey : నేను బ్రతికే ఉన్నా..అందుకోసమే నేను చనిపోయినట్లు పోస్టు పెట్టా

Poonam Pandey

Poonam Pandey : ఇంటర్నెట్ సంచలనం పూనమ్ పాండే చనిపోలేదు. తాను బ్రతికే ఉన్నానని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసం తాను సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయినట్లు ప్రకటన చేసినట్లు చెప్పారు. పూనమ్ పాండే పెద్ద సాహసమే చేసినా.. మరోవైపు నెటిజన్లు వరస్ట్ పబ్లిసిటీ స్టంట్ అంటూ విమర్శలు చేస్తున్నారు.

Poonam Pandey : పూనమ్ పాండే వార్తల్లో నిలిచిన ప్రధాన వివాదాలు ఇవే..

పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయారన్న వార్త  శుక్రవారం  దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. సెలబ్రిటీలంతా షాకయ్యారు. ఆమె మేనేజర్ సైతం ఈ వార్తను ధృవీకరించడంతో అంతా నిజమని నమ్మారు. క్యాన్సర్ మహమ్మారికి చిన్న వయసులో పాండే బలైపోయారంటూ వార్తలు రాసారు. సర్వైకల్ క్యాన్సర్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై దేశమంతా చర్చించింది. ఇదిలా ఉండగా పాండే అకస్మాత్తుగా సోషల్ మీడియాలో వీడియోలతో ప్రత్యక్షమయ్యారు.  తాను చనిపోలేదంటూ పోస్టు చేసారు. దాంతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు. తర్వాత విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.

పాండే క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసమే ఇదంతా చేసినట్లు వీడియోలో వెల్లడించారు. ‘ గర్భాశయ క్యాన్సర్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక వేలాది మంది మహిళలు చనిపోతున్నారు. ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించదగినది.  HPV వ్యాక్సిన్, లేదా ముందస్తు పరీక్షలు దీనికి కీలకమైనవి. ఈ వ్యాధి తో ఎవరూ తమ ప్రాణాలు కోల్పోకుండా చూసుకునే మార్గాలు ఉన్నాయి. అవగాహనతో అందరం ముందుకు నడుద్దాం. ప్రతి స్త్రీ తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియచేద్దాం’ అంటూ పాండే వీడియోలో మాట్లాడారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Cervical Cancer : సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించిన పూనమ్ పాండే.. ఈ క్యాన్సర్ ఎలా సోకుతుందంటే..

పూనమ్ పాండే ఇంత పెద్ద స్టంట్ చేస్తే.. నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. ఆమె మీద పూర్తిగా నమ్మకం పోయిందని.. వరస్ట్ పబ్లిసిటీ స్టంట్ అని విమర్శలు గుప్పిస్తున్నారు. వీటన్నింటికి సిద్ధపడే పాండే ఈ సాహసానికి పూనుకున్నారనిపిస్తోంది. ఫిబ్రవరి 4 ‘వరల్డ్ క్యాన్సర్’ డే సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన అవసరం అని మాత్రం ఈ స్టంట్ ప్రజల్ని అప్రమత్తం చేసింది.