Pawan Kalyan: పవర్ స్టార్ మరో సినిమా.. రావణాసుర దర్శకుడితో చర్చలు!

భీమ్లానాయక్ గా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ తీసుకొచ్చిన పవన్.. ప్రస్తుతం టార్గెట్ హరిహర వీరమల్లు అంటున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమాని లైన్ లో పెట్టారు. కానీ ఈలోపే మరో రెండు..

Pawan Kalyan: పవర్ స్టార్ మరో సినిమా.. రావణాసుర దర్శకుడితో చర్చలు!

Pawan Kalyan

Updated On : March 19, 2022 / 3:01 PM IST

Pawan Kalyan: భీమ్లానాయక్ గా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ తీసుకొచ్చిన పవన్.. ప్రస్తుతం టార్గెట్ హరిహర వీరమల్లు అంటున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమాని లైన్ లో పెట్టారు. కానీ ఈలోపే మరో రెండు ప్రాజెక్ట్ లను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారనే కథనాలు కూడా వస్తున్నాయి. 2022లో ఫస్ట్ మెగా హిట్ గా నిలిచింది భీమ్లానాయక్. వన్ మ్యాన్ ఆర్మీగా పవన్ భీమ్లానాయక్ ను వంద కోట్ల క్లబ్ లో చాలా ఈజీగా చేర్చేశారు. ఇప్పుడిక ఫోకస్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై పెట్టారు.

Pawan Kalyan: హరిహర వీరమల్లు.. మరోసారి వాయిదా?

క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లును వీలైనంత త్వరగా పూర్తి చేయాలనేది పవన్ ఫస్ట్ ప్రియారిటీ. ఆపై లైన్ లో హరీశ్ శంకర్ భవదీయుడు.. భగత్ సింగ్ ప్రాజెక్ట్ ఉన్నా.. పవర్ స్టార్ మాత్రం మరో రెండు సినిమాలపై కాన్సంట్రేట్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ టీంతోనే పవన్ వినోదయ సిత్తం రీమేక్ ను ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తుంది. మల్టీస్టారర్ గా తెరకెక్కబోయే ఈ మూవీలో పవన్ తో పాటూ సాయిధరమ్ తేజ్ లేదంటే వైష్ణవ్ తేజ్ నటించే అవకాశముందని చెప్తున్నారు. ఇది కాకపోతే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో రీమేక్ విక్రమ్ వేదా ఉన్నట్టు కూడా చెప్తున్నారు.

Pawan Kalyan: ఆ డైరెక్టర్‌ను పవన్ పక్కనబెట్టాడా?

కాగా, ఇప్పుడు ఇవి రెండు కాకుండా మరో ప్రాజెక్ట్ పై కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. మాస్ మహారాజ రవితేజ దర్శకుడు సుధీర్ వర్మతో పవన్ ఓ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ దర్శకుడు రవితేజతో రావణాసుర అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. రావణాసుర తర్వాత పవన్ హీరోగా ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయట. ఇప్పటికే కథా చర్చలు కూడా మొదలవగా దాదాపుగా ఈ సినిమా ఒకే అయ్యే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.