Pawan Kalyan: హరిహర వీరమల్లు.. మరోసారి వాయిదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘భీమ్లా నాయక్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు.

Pawan Kalyan: హరిహర వీరమల్లు.. మరోసారి వాయిదా?

Pawan Kalyan Hari Hara Veera Mallu Shooting Postponed

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘భీమ్లా నాయక్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు సాగర్ కె.చంద్ర తెరకెక్కించగా, మరో యంగ్ హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాలో పవన్‌ను ఢీకొట్టే పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందే పవన్ పలు సినిమాలను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ కూడా ఒకటి.

Pawan Kalyan: పవర్ ట్రీట్.. పవన్ బ్యాక్ టూ బ్యాక్ రీమేక్స్

పూర్తిగా పీరియాడికల్ సబ్జెక్ట్‌తో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర సరికొత్తగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలో వెల్లడించింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభించినా కూడా ఇంకా పూర్తి కాలేదు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. కరోనా ప్రభావం తగ్గినా కూడా ఈ సినిమా షూటింగ్ సరిగా జరగలేదు. భీమ్లా నాయక్ చిత్రానికి పవన్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతూ వచ్చింది.

ఇక ఇప్పుడు వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. దానికోసం మార్చి మూడో వారం నుండి ఈ సినిమా కోసం ఓ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశాడు. అయితే పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ షూటింగ్‌ను ఏప్రిల్ రెండో వారానికి వాయిదా వేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇక ఈ షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Bheemla Nayak: ఓటీటీలో భీమ్లా.. రికార్డులు ఆహా అనాల్సిందే!

ఈ షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ కూడా వేస్తున్నారట. ఇక ఈ షెడ్యూ‌ల్‌తో సినిమాలోని కీలక భాగం షూటింగ్ పూర్తవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడనే వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ సరసన ఈ సినిమాలో హీరోయిన్లుగా నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్‌లు నటిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.