Bheemla Nayak: భీమ్లా కేక.. కొత్త లెక్కలు సెట్ చేస్తున్న పవర్ స్టార్!

ఎంత హైప్ క్రియేట్ చేసిందో అంతకుమించిన పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది పవర్ స్టార్ మూవీ. వకీల్ సాబ్ లెక్కలకే చుక్కలు చూపించేలా దూసుకుపోతున్నాడు భీమ్లానాయక్. డైలాగ్ డెలివరీలో బద్రిని..

Bheemla Nayak: భీమ్లా కేక.. కొత్త లెక్కలు సెట్ చేస్తున్న పవర్ స్టార్!

Bheemla Nayak

Updated On : February 26, 2022 / 4:37 PM IST

Bheemla Nayak: ఎంత హైప్ క్రియేట్ చేసిందో అంతకుమించిన పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది పవర్ స్టార్ మూవీ. వకీల్ సాబ్ లెక్కలకే చుక్కలు చూపించేలా దూసుకుపోతున్నాడు భీమ్లానాయక్. డైలాగ్ డెలివరీలో బద్రిని గుర్తుకుతెస్తున్న పవన్ ను చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఒకటా, రెండా ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ పై కూర్చొబెడుతున్నారు పవన్, రానా.

Bheemla Nayak : తమన్.. లాలా భీమ్లా.. స్టెప్పులు అదిరేలా..

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు సూపర్ బూస్టప్ నిచ్చింది భీమ్లానాయక్. గతేడాది వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టిన పవన్ కల్యాణ్.. ఈ ఏడాది భీమ్లాగా థియేటర్స్ కొచ్చి అంతకు మించి అనిపిస్తున్నారు. త్రివికమ్ పవర్ఫుల్ డైలాగ్స్.. ఆ డైలాగ్స్ ను మరింత డైనమిక్ గా పవన్ డెలివరీ చేయడం చూస్తుంటే భీమ్లాగా పవన్ ను తప్ప మరొకర్ని ఊహించుకోవడమే కష్టం అంటున్నారు ప్రేక్షకులు. ఒక దానిని మించిన మరో సీన్.. అదిరే స్క్రీన్ ప్లేతో వచ్చిన భీమ్లా నాయక్ థియేటర్స్ లో విజిల్స్ కొట్టిస్తున్నాడు.

Bheemla Nayak : తెలుగు సినిమాని ఇక ఏ ఫోర్స్ ఆపలేదు.. ‘భీమ్లా నాయక్’పై దేవాకట్టా వ్యాఖ్యలు..

నిజానికి పవన్ హీరోగా పక్కనుంటే మిగిలిన హీరోలు సినిమాలో తేలిపోతారు. కానీ దానికి భిన్నంగా రానా యాక్టింగ్ స్కిల్స్ తో తనకంటూ ఓ ఐడెంటిటీని సెట్ చేసుకున్నాడు. భీమ్లాకు ధీటుగా ఈగోను చూపించే డేనియల్ క్యారెక్టర్ లో క్లైమాక్స్ వరకు ఖతర్నాక్ టెంపో కంటిన్యూ చేశాడనే టాక్ అందరి నుంచి వినిపిస్తోంది. పవన్, రానా ఇద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ థియేటర్ లో మాస్ జాతరను చూపించాయి.

Bheemla Nayak: కథ మీద ప్రేమను చంపుకున్నప్పుడే మనం అనుకున్నది వస్తుంది – త్రివిక్రమ్

ఒరిజనల్ అయ్యప్పనుమ్ కోషియుమ్ తో పోలిస్తే భీమ్లానాయక్ సినిమానే హైలైట్ అంటున్నారు. తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా భీమ్లానాయక్ వచ్చాడంటే డైరెక్టర్ సాగర్ చంద్రతో పాటూ ఆ క్రెడిట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చెల్లుతుంది. నిత్యామీనన్, సంయుక్త మీనన్ లకు సైతం మంచి మార్కులే పడుతున్నాయి. ఇక ఇప్పటికే రికార్డ్స్ కొట్టేసిన లాలా భీమ్లా.. ఫ్యాన్స్ తో మాస్ స్టెప్పులు వేయిస్తుంటే.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్ సీన్ ని ఎలివేట్ చేసింది. మొత్తానికి అన్ని రకాలుగా ఫ్యాన్స్ కోసం పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్ ను పట్టుకొచ్చి వాళ్లని 100 పర్సెంట్ ఖుషీ చేశారు పవర్ స్టార్.