Project K : ప్రభాస్ బ్యాక్ టు షూట్.. ప్రాజెక్ట్ K..
ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ ప్రధాన పాత్రలుగా ప్రాజెక్టు K సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకోగా............
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ ప్రధాన పాత్రలుగా ప్రాజెక్టు K సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకోగా తాజాగా మరో షెడ్యూల్ ని ప్రారంభించింది.
Sree Vishnu : 14 ఏళ్లుగా స్నేహితులం.. ఇప్పటికి సినిమా కుదిరింది
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రభాస్ ఈ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్రభాస్ మరియు మరికొంతమంది యాక్టర్స్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కోసం వేసిన సెట్స్‌లో ప్రస్తుతం టాకీ పార్ట్ షూటింగ్ జరుగుతోంది. ఈ నెల 10 వరకు ఈ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకొని మరో షెడ్యూల్ ని మొదలు పెడతారు. ఇక ఇటీవల ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ మహీంద్రా కంపెనీతో ట్విట్టర్లో మాట్లాడి కొన్ని స్పెషల్ వెహికల్స్ రెడీ చేపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ సినిమాని ప్రభాస్ కెరీర్ లోనే 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.