Prabhas : పెళ్లి పై ప్రభాస్ కామెంట్స్.. చేసుకుంటాను కానీ..
ఎపిసోడ్ లో అందరూ అనుకున్నట్టే ప్రభాస్ పెళ్లి గురించి టాపిక్ తెచ్చాడు బాలయ్య. ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుంటాను కానీ ఇంకా రాసిపెట్టలేదేమో. ప్రస్తుతానికి ఒక్కడినే ఉన్నా........

Prabhas comments on his Marriage
Prabhas : బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు ఎపిసోడ్స్ అవ్వగా ఏడో ఎపిసోడ్ లో ప్రభాస్ ని తీసుకొచ్చారు. ప్రభాస్ ఈ షోకి వస్తున్నాడు అని తెలియడంతో ముందునుంచి ఈ ఎపిసోడ్ పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి ఫ్యాన్స్ కి మరింత జోష్ ఇచ్చింది ఆహా టీం.
ప్రభాస్ అన్‌స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమ్ అవుతుందని చెప్పినా డిసెంబర్ 29 రాత్రే రిలీజ్ చేసి అభిమానులకి ముందుగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఇచ్చింది ఆహా. ఎపిసోడ్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాలకే ఆహా సర్వర్లు ఎక్కువ ఫ్లోటింగ్ తో క్రాష్ అయ్యాయి అంటే ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
Prabhas : ప్రభాస్ లైఫ్ లాంగ్ కోరిక ఏంటో తెలుసా??
ఇక ఎపిసోడ్ లో ప్రభాస్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. ప్రభాస్ నటుడిగా మారి 20 సంవత్సరాలు అవుతుండటంతో అభిమానులతో స్పెషల్ షూట్ చేసి ప్రోమో కూడా వేశారు. ఎపిసోడ్ లో అందరూ అనుకున్నట్టే ప్రభాస్ పెళ్లి గురించి టాపిక్ తెచ్చాడు బాలయ్య. ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుంటాను కానీ ఇంకా రాసిపెట్టలేదేమో. ప్రస్తుతానికి ఒక్కడినే ఉన్నా వంట, ఫుడ్ విషయంలో చెల్లి, వదిన సపోర్ట్ చేస్తున్నారు. తర్వాత చూడాలి అని అన్నారు. ఇక బాలయ్య శర్వానంద్ నువ్వు చేసుకున్నాక పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్పడంతో ప్రభాస్.. అయితే నేను సల్మాన్ ఖాన్ చేసుకున్నాక చేసుకుంటాను అని చెప్పాలేమో అని అన్నాడు.