Prabhas: 20 ఏళ్ళ సినీ కెరీర్‌ని పూర్తీ చేసుకున్న ప్రభాస్..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. 'ఈశ్వర్' సినిమాతో తెలుగుతెరపై తన సినీ కెరీర్ ని మొదలుపెట్టి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. వర్షం సినిమాతో కెరీర్ లో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్న ప్రభాస్, ఛత్రపతి సినిమాతో...

Prabhas: 20 ఏళ్ళ సినీ కెరీర్‌ని పూర్తీ చేసుకున్న ప్రభాస్..

Prabhas Completing 20 years cinema career

Updated On : November 11, 2022 / 2:57 PM IST

Prabhas: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ‘ఈశ్వర్’ సినిమాతో తెలుగుతెరపై తన సినీ కెరీర్ ని మొదలుపెట్టి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. వర్షం సినిమాతో కెరీర్ లో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్న ప్రభాస్, ఛత్రపతి సినిమాతో మాస్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. చక్రం లాంటి మూవీలో నటించి, నటుడి గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిల్లా, మున్నా వంటి స్టైలిష్ చిత్రాలు ప్రభాస్ ని యూత్ కి మరింత దగ్గర చేశాయి.

Prabhas: మూడు ప్రాజెక్టులతో బిజీగా మారిన ప్రభాస్.. తీరికే లేదట!

‘బుజ్జిగాడు’లా నవ్విస్తూ, ‘డార్లింగ్’లా ప్రేమిస్తూ, ఫ్యామిలీ ఆడియన్స్ చేత కూడా ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ అనిపించుకున్నాడు. ఇక మిర్చిలో తన నట విశ్వరూపం చూపించి తన కెరీర్ లోనే ఆ సినిమాను మైల్ స్టోన్ గా మార్చుకున్నాడు. ఆ తరువాత రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ప్రభాస్ ని ఇండియన్ సూపర్ స్టార్ గా మార్చేసింది. దేశంలోని ప్రతి టాప్ టెక్నీషియన్ ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారంటే.. మన రెబల్ స్టార్ ఎంతటి శిఖరానికి చేరుకున్నాడో అర్ధమవుతుంది.

అయితే ప్రభాస్ మునపటి చిత్రాలు సాహో, రాధే శ్యామ్ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇటీవల వచ్చిన ఆదిపురుష్ టీజర్ కూడా అభిమానులను నిరాశ పరచడంతో మూవీ టీం మళ్ళీ రీషూట్ కి వెళ్ళింది. ఇక సెట్స్ మీద ఉన్న సాలార్, ప్రాజెక్ట్-K మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. కాగా మూవీ మేకర్స్ ప్రభాస్ ఇమేజ్ ని వాడుకుంటూ కథాకథనాలను పక్కన పెడుతున్నారు, దానివల్ల ప్రభాస్ ఇమేజ్ దెబ్బ తింటుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

ఇక ప్రభాస్ సినీ పరిశ్రమలో 20 ఏళ్ళు పూర్తీ చేసుకున్న సందర్భంగా.. ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ‘వర్షం’ ని ఈరోజు రీ రిలీజ్ చేశారు. దీంతో థియేటర్ల వద్ద రెబల్ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.