Prabhas : ఆదిపురుష్ హిట్ అవ్వాలని.. భద్రాద్రి రాముడికి 10 లక్షల విరాళం ఇచ్చిన ప్రభాస్..
దిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. త్వరలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు చిత్రయూనిట్.

Prabhas donation to Bhadrachalam Temple
Adipurush : ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతి సనన్(Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అవ్వగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. త్వరలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు చిత్రయూనిట్.
తాజాగా భద్రాచలం సీతారామాలయంకు ప్రభాస్ 10 లక్షల విరాళం పంపించారు. ప్రభాస్ తరపున ఆయన బంధువులు దంతులూరి సత్యనారాయణ రాజు, వేమారెడ్డి, విక్రమ్, శ్రీనివాసరెడ్డి.. పలువురు భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిని కలిసి పదిలక్షల చెక్ అందించారు అనంతరం ప్రభాస్ ఆదిపురుష్ సినిమా హిట్ అవ్వాలని ఆలయంలో పూజలు నిర్వహించారు.
Adipurush : మరో వివాదంలో ఆదిపురుష్.. చిత్రయూనిట్ పై ఫైర్ అవుతున్న యూట్యూబర్స్..
ఈవో రమాదేవి మాట్లాడుతూ.. ప్రభాస్ తరపున అందిన ఈ 10 లక్షలను అన్నదానం, గోశాల విస్తరణ, ఆలయ అవసరాలకు కేటాయిస్తాం అని తెలిపారు.