Prabhas : ప్రభాస్ ఫేస్‌బుక్ పేజీ హ్యాక్.. ప్రభాస్ పేజీలో వేరే పోస్టులు..

తాజాగా ప్రభాస్ పేరు వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం ప్రభాస్ ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ అవ్వడమే. ప్రభాస్ ఫేస్‌బుక్ పేజీ నిన్న రాత్రి హ్యాక్ అయింది.

Prabhas : ప్రభాస్ ఫేస్‌బుక్ పేజీ హ్యాక్.. ప్రభాస్ పేజీలో వేరే పోస్టులు..

Prabhas Facebook Page Hacked on yesterday Night still not solve the Issue

Updated On : July 28, 2023 / 7:57 AM IST

Prabhas Facebook Page : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సలార్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ సెప్టెంబర్ లో సలార్ పార్ట్ 1 తో రానున్నాడు. ఇక ఇటీవలే కల్కి 2898AD సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసి హాలీవుడ్ రేంజ్ సినిమాని ఇండియన్ ప్రేక్షకులకు చూపించడానికి రెడీ అయిపోయాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా షూట్ జరుగుతుంది. మరో పక్క మారుతి దర్శకత్వంలో సినిమా షూట్ కూడా జరుగుతుంది. ఇవి కాక మరిన్ని సినిమాలు లైన్లో పెడుతున్నాడు ప్రభాస్.

తాజాగా ప్రభాస్ పేరు వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం ప్రభాస్ ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ అవ్వడమే. ప్రభాస్ ఫేస్‌బుక్ పేజీ నిన్న రాత్రి హ్యాక్ అయింది. అందులో ఎవరో రెండు పోస్టులు కూడా పోస్ట్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజన్లు.. ప్రభాస్ పేజీలో ఈ వీడియోలు ఏంటి అని సందేహం వ్యక్తం చేశారు. ఇది ప్రభాస్ దృష్టికి వెళ్లడంతో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. నా ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ అయింది. టెక్నీకల్ టీం దాని మీద వర్క్ చేస్తున్నారు అంటూ పోస్ట్ చేశాడు.

BRO Twitter Review : బ్రో సినిమా ట్విట్టర్ రివ్యూ.. పవన్ అన్ని సినిమాల రిఫరెన్స్‌లతో అదరగొట్టేశారంట..

ఇవాళ ఉదయానికి కూడా ప్రభాస్ ఫేస్‌బుక్ పేజీలో ఉన్న వేరే పోస్టులు ఇంకా తొలగలేదు. దీంతో టెక్నీకల్ టీం ఇంకా ప్రభాస్ పేజీపై వర్క్ చేస్తున్నారు. అసలు ఏకంగా ప్రభాస్ పేజీని ఎవరు హ్యాక్ చేశారబ్బా అని అభిమానులు, నెటిజన్లు ఆలోచిస్తున్నారు.