Rajsaab vs Jana Nayakudu: ఇదేం అన్యాయం.. రాజాసాబ్ ని పక్కన పెట్టి విజయ్ సినిమాకు థియేటర్స్.. మండిపడుతున్న ఫ్యాన్స్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ది రాజాసాబ్ సినిమాకు ఈక్వల్ గా జన నాయకుడు(Rajsaab vs Jana Nayakudu) సినిమాకు థియేటర్స్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్.
Prabhas fans angry over allocating more theaters to Jana Nayakudu movie.
- ఒకేరోజు రాజాసాబ్, జన నాయకుడు విడుదల
- తెలుగు స్టేట్స్ లో రాజసాబ్ కాకుండా జన నాయకుడు మూవీకి థియేటర్స్
- ఇదేం అన్యాయం అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం
Rajsaab vs Jana Nayakudu: ఈ సంక్రాంతికి సినిమా జోరు ఒక రేంజ్ లో ఉండేలా ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో నిలుస్తున్నాయి. అందుకే, థియేటర్స్ సమస్య తలెత్తనుంది. కానీ, అన్నికన్నా ముందుగా వస్తున్న ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు మాత్రం దారుణమైన అన్యాయం జరుగుతోంది అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా ది రాజాసాబ్(Rajsaab vs Jana Nayakudu) సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా కాలం తరువాత ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపిస్తుండటంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఈగర్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ, అదే రోజున తమిళ స్టార్ విజయ్ తళపతి జన నాయకుడు సినిమా కూడా విడుదల అవుతోంది.
Allu Cinemas: మామను మర్చిపోలేదు.. ‘అల్లు సినిమాస్’లో మెగాస్టార్ ఫోటో స్పెషల్ అట్రాక్షన్
దీంతో, తెలుగులో ప్రభాస్ సినిమాకు ఈక్వల్ గా జన నాయకుడు సినిమాకు థియేటర్స్ అలాకేట్ చేస్తున్నారు. చాలా ఏరియాల్లో ప్రభాస్ సినిమాను పక్కన పెట్టి మరీ జన నాయకుడు సినిమాకు థియేటర్స్ ఇస్తున్నారు. కానీ, తమిళనాడులో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. జనవరి 9న రాజాసాబ్ సినిమాకు థియేటర్స్ దొరకడం కష్టంగా మారింది.
అందుకే, అక్కడ ఒకరోజు ఆలస్యంగా విడుదల అవుతుంది రాజాసాబ్. అది కూడా అతి తక్కువ థియేటర్స్ లో. ఈ విషయంపై ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనకు అక్కడ థియేటర్స్ ఇవ్వనపుడు, మన సినిమాను పక్కన పెట్టి వేరే సినిమాకు థియేటర్స్ ఇవ్వడం ఏంటి అని మండిపడుతున్నారు. ఇదెక్కడి అన్యాయం అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి నెటిజన్స్ చేస్తున్న ఈ కామెంట్స్ కి మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి.
