Fauzi : ప్రభాస్-హను మూవీ టైటిల్ ఇదే.. ఫస్ట్‌లుక్ అదుర్స్..
హను రాఘవపూడి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫౌజీ (Fauzi) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

Prabhas Hanu Raghavapudi movie name is Fauzi
Fauzi : హను రాఘవపూడి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. కొత్త అమ్మాయి ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి లు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
కాగా.. నేడు ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రానికి ఫౌజీ (Fauzi) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఈ చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
‘పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు.. పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు.. గురువు లేని ఏకలవ్యుడు.. పుట్టకతోనే అతడు ఓ యోధుడు.. మన చరిత్రలో దాగిన అధ్యాయాల్లోని అత్యంత ధైర్యవంతుడైన సైనికుడి కథ ఇది. అతడే ఫౌజీ.’ అంటూ ప్రభాస్ గొప్ప దనాన్నిచెప్పుకొచ్చింది.
ఇందులో ప్రభాస్ చాలా సీరియస్‌గా చూస్తున్నట్లుగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
पद्मव्यूह विजयी पार्थः
पाण्डवपक्षे संस्थित कर्णः।
गुरुविरहितः एकलव्यः
जन्मनैव च योद्धा एषः॥#PrabhasHanu is #FAUZI ❤🔥The bravest tale of a soldier from the hidden chapters of our history 🔥
Happy Birthday, Rebel Star #Prabhas ❤️#HappyBirthdayFAUZI#HappyBirthdayPRABHAS… pic.twitter.com/bwv4PPAtiB
— Fauzi (@FauziTheMovie) October 23, 2025