Kalki Pre Release Event : నేడే ‘కల్కి’ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎన్నింటికి, లైవ్ ఎక్కడ చూడాలి?
నేడు బాలీవుడ్ లో గ్రాండ్ గా కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

Prabhas Kalki 2898AD Movie Mumbai Pre Release Event Full Details Here
Kalki Pre Release Event : మరికొద్ది రోజుల్లోనే ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, ట్రైలర్, సాంగ్ తో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. ఇప్పటికే కల్కిలో ప్రభాస్ వాడిన వెహికల్ తో ప్రమోషన్స్ చేయగా ఇప్పుడు మూవీ టీమ్ రంగంలోకి దిగుతుంది.
నేడు బాలీవుడ్ లో గ్రాండ్ గా కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ముంబైలో కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నేడు సాయంత్రం 6 గంటల నుండి నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ముంబై ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ ని కేవలం వైజయంతి నెట్ వర్క్ యూట్యూబ్ ఛానల్ లో మాత్రమే లైవ్ ఇస్తున్నారు.
Also Read : Kalki Review : ‘కల్కి’ సెన్సార్ రివ్యూ.. ఏకంగా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన బాలీవుడ్.. ప్రభాస్ కామెడీతో పాటు..
ముంబైలో జరగబోయే ఈవెంట్ కి పలువురు బాలీవుడ్ ప్రముఖులుకూడా హాజరవుతారని సమాచారం. తెలుగులో కూడా త్వరలోనే కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ముంబైలో ఏ రేంజ్ లో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారో, ప్రభాస్ ఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎదురుచూస్తున్నారు. ముంబైలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు సాయంత్రం 6 గంటల నుండి ఈ కింది వీడియో లింక్ లో చూసేయండి.