Adipurush : మొదటిరోజు కలెక్షన్స్‌తోనే సంచలనం సృష్టించిన ఆదిపురుష్..
ప్రభాస్ ఆదిపురుష్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి టాక్ ని సొంతం చేసుకున్న కలెక్షన్స్ పరంగా మాత్రం సంచలనం సృష్టించింది. మొదటిరోజే ఈ సినిమా..
![Adipurush : మొదటిరోజు కలెక్షన్స్‌తోనే సంచలనం సృష్టించిన ఆదిపురుష్.. Adipurush : మొదటిరోజు కలెక్షన్స్‌తోనే సంచలనం సృష్టించిన ఆదిపురుష్..](https://10tv.in/wp-content/uploads/2023/06/Prabhas-Kriti-Sanon-Adipurush-first-day-collections-report.jpg)
Prabhas Kriti Sanon Adipurush first day collections report
Prabhas Adipurush : ప్రభాస్ రాముడిగా నటిస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం నిన్న (జూన్ 16) భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 6200 థియేటర్స్ లో విడుదల కాగా ఒక్క ఇండియాలోనే దాదాపు 4000 పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ అందుకుంది.
Adipurush : ఆదిపురుష్ దెబ్బతో పీవీఆర్ ఐనాక్స్ షేర్లు లాస్.. దాదాపు 3 శాతం పైగా..
మొదటిరోజు ఈ సినిమా ఏకంగా 140 కోట్లు కలెక్షన్స్ అందుకున్నట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ రెండు రోజులు కూడా ఆదిపురుష్ టికెట్స్ భారీగా అమ్ముడుపోయిని. ఈ కలెక్షన్స్ జోరు చూస్తుంటే ఫస్ట్ వీకెండ్ తోనే ఆదిపురుష్ 200 కోట్ల మార్క్ ని అందుకునేలా కనిపిస్తుంది. మరి ఆదివారం నాటికి ఈ చిత్రం ఏ స్థాయి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. కాగా ప్రభాస్ గత సినిమాలు బాహుబలి 2, సాహూ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకున్నాయి.
Adipurush : ఆదిపురుష్ కంటే జపనీస్ తీసిన రామాయణం బెటర్.. నెటిజెన్లు ట్వీట్స్!
ఇప్పుడు ఈ చిత్రం కూడా 100 కోట్ల మార్క్ క్రాస్ చేయడంతో.. మూడు సినిమాలతో ఇండియాలోనే ఏకైక హీరోగా నిలిచాడు. దీంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఈ సినిమా పై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. రామాయణాన్ని అగౌరవపరిచేలా, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా ఉందంటూ పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సేన’ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఢిల్లీ హైకోర్టులో ఆదిపురుష్ పై పిటిషన్ కూడా దాఖలు చేశారు.
The triumph of #Adipurush at Global Box Office with a record-breaking opening of ₹ 140 CR.! This cinematic extravaganza shatters all the records and conquers the heart of audience across ages! The true-blue family blockbuster, this magnum opus has especially captivated the… pic.twitter.com/1xrI5lmiIx
— People Media Factory (@peoplemediafcy) June 17, 2023