Radhe Shyam Glimpse: ఇంతమంచి అబ్బాయికి ఇంకా పెళ్ళెందుకు కాలేదు!

ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమాలలో రాధేశ్యామ్ కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ క్రేజీ అప్డేట్..

Radhe Shyam Glimpse: ఇంతమంచి అబ్బాయికి ఇంకా పెళ్ళెందుకు కాలేదు!

Radhe Shyam Glimpse

Updated On : February 14, 2022 / 2:09 PM IST

Radhe Shyam Glimpse: ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమాలలో రాధేశ్యామ్ కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది. మార్చి 11న రాధే శ్యామ్ రిలీజ్ కానుందని ఈ మధ్యనే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనగా యూనిట్ కూడా ప్రమోషన్ మొదలు పెట్టింది.

Bheemla Nayak: ఏప్రిల్‌కు విడుదల వాయిదా.. కారణం ఏంటంటే?

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లు మొదలు పెట్టిన యూనిట్ అందులో భాగంగా వాలంటైన్ డే స్పెషల్ కానుకగా గ్లిమ్ప్స్ రిలీజ్ చేసింది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ బాషలలో విడుదల చేసిన ఈ గ్లిమ్ప్స్ లో ప్రభాస్-పూజల మధ్య లవ్ ప్రపోజల్ సన్నివేశాలను హైలెట్ చేశారు. మళ్ళీ లైఫ్ లో వాడి మొహం చూడను అనే పూజ వాయిస్ తో మొదలయ్యే ఈ గ్లిమ్ప్స్.. కాస్త ఫన్నీగా.. ఇంకాస్త లవ్ ప్రపోజల్ జోడించి కట్ చేశారు.

Gurthunda Seethakalam Trailar: చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం.. శీతాకాలం!

కుక్ చేస్తావ్.. ఇంత బాగా మాట్లాడతావ్.. ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్ళెందుకు కాలేదు అని ప్రేరణ అడిగితే.. విక్రమాదిత్య ఇబ్బంది పడడం చూసేందుకు ఫన్నీగా ఉంది. మొత్తంగా గ్లిమ్ప్స్ తో మేకర్స్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇవ్వగా.. ఇదే రోజున ఫిబ్రవరి 14న రాత్రి 8 గంటలకు థీమ్ పార్టీ కూడా ప్లాన్ చేసింది యూనిట్. సౌత్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైమ్ జరగనున్న ఈ థీమ్ పార్టీ హైదరాబాద్ కెమిస్ట్రీ క్లబ్ లో నిర్వహించనున్నారు. మరి ఆ పార్టీ ఇంకెంత స్పెషల్ గా ఉంటుందో చూడాలి.