Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలు వరుసగా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాను రిలీజ్‌కు రెడీ చేసిన ప్రభాస్, ఆ తరువాత కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్’ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలతో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ప్రాజెక్ట్-K’ను కూడా స్టార్ట్ చేశాడు ప్రభాస్. ఈ మూడు సినిమాలను కూడా పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలతో ప్రభాస్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.
Maruthi Changes Plan For Prabhas: ప్రభాస్ కోసం ప్లాన్ మార్చిన మారుతి..?
ఈ సినిమాలు పూర్తికాకముందే ప్రభాస్ మరో డైరెక్టర్ మారుతితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను చాలా త్వరగా పూర్తి చేయాలని ప్రభాస్ నిర్ణయించాడట. అందుకే సినిమాలను తక్కువ టైమ్‌లో ఫినిష్ చేసే మారుతితో ఓ హార్రర్ కామెడీ మూవీని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.
Prabhas Maruthi Movie Launched: మారుతితో సైలెంట్‌గా మొదలుపెట్టిన ప్రభాస్
ప్రభాస్ మారుతి కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను చిత్ర యూనిట్ సంప్రదించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందని.. అందుకే ఈ పాత్ర కోసం సంజయ్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యిందట. ఇక సంజయ్ దత్ రీసెంట్గా కేజీయఫ్-2 మూవీలో ‘అధీరా’ పాత్రతో దక్షిణాది ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాడు. మరి ప్రభాస్ సినిమాలో సంజయ్ దత్ నిజంగా నటిస్తాడా.. ఒకవేళ నటిస్తే.. ఆయన ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.