Adipurush : బాక్సాఫీస్‌ వద్ద 78 శాతం ఆదిపురుష్ కలెక్షన్స్.. ఇప్పటి వరకు ఎంత వచ్చాయి..

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మొదటి వీకెండ్ బాక్స్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

Adipurush : బాక్సాఫీస్‌ వద్ద 78 శాతం ఆదిపురుష్ కలెక్షన్స్.. ఇప్పటి వరకు ఎంత వచ్చాయి..

Prabhas Om Raut Adipurush movie collections details in telugu

Prabhas Adipurush : బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) డైరెక్షన్ లో రామాయణ కథాంశంతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ఆదిపురుష్. ప్ర‌భాస్‌ రాముడిగా, కృతి స‌న‌న్ (Kriti Sanon) సీత‌గా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా ఈ చిత్రంలో నటించారు. జూన్ 16న భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఎన్నో విమర్శలు ఎదురుకోవడమే కాకుండా వివాదాలకు కూడా దారి తీస్తుంది. విడుదలకు ఎన్నో అంచనాలు ఉండడంతో బుకింగ్స్ అనేవి పెద్ద ఎత్తున జరిగాయి. దీంతో ఆదిపురుష్ భారీ ఓపెనింగ్స్ అందుకుంది.

Adipurush : ఆదిపురుష్ టీంని నిలబెట్టి కాల్చేయాలి.. శక్తిమాన్ నటుడు ముకేష్ ఖన్నా..

కానీ మొదటి వీకెండ్ పూర్తి అయ్యిన దగ్గర నుండి ఈ మూవీకి అసలు కలెక్షన్స్ రావడం లేదు. మొదటిరోజు ఈ సినిమా 140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. నెక్స్ట్ రెండు రోజులు కూడా రోజుకి 100 కోట్లు అందుకొని మొదటి వీకెండ్ పూర్తి అయ్యేపాటికీ 340 కోట్ల గ్రాస్ అందుకొని సంచలనం సృష్టించింది. కానీ ఆ తరువాత నుంచి ఈ సినిమా కలెక్షన్స్ డౌన్ అవుతూ వచ్చాయి. ఎంతలా అంటే ఆదివారంతో పోలిస్తే.. మంగళవారం నాటికి ఈ చిత్రం కలెక్షన్స్ 78 శాతం పడిపోయాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం 395 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది.

Adipurush : ఆదిపురుష్ సినిమాలో ఆక్వామ్యాన్ అంటూ నెటిజెన్స్ ట్రోల్స్.. మీరు గమనించారా..?

ఇదే విధంగా కలెక్షన్స్ తగ్గుతూ వస్తే ఆదిపురుష్ బ్రేక్ ఈవెన్ సాధించడం చాలా కష్టం అంటున్నారు సినీ పండితులు. ఇది ఇలా ఉంటే.. ఈ మూవీ పై హిందూ సంఘాలు, ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమలోని వారి కూడా మేకర్స్ పై వైరల్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ అయితే ఏకంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి (Narendra Modi).. ఆదిపురుష్ అసలు రామాయణమే కాదు అంటూ, ఆ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ లేఖ రాసింది.